కశ్మీర్‌పై అమెరికా తొలిస్పందన.. పాక్ పార్లమెంట్‌కు ప్రధాని డుమ్మా
జమ్ముకశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అమెరికా ఆచితూచి స్పందించింది. కశ్మీర్ పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ చెప్పారు. కశ్మీర్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారం అని భారత్ చెబుతోందని… కాకపోతే కశ్మీర్ నిర్బంధానికి సంబంధించిన వార్తలే తమను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని… సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు అమె వెల్లడించారు. […]
జమ్ముకశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అమెరికా ఆచితూచి స్పందించింది. కశ్మీర్ పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ చెప్పారు.
కశ్మీర్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారం అని భారత్ చెబుతోందని… కాకపోతే కశ్మీర్ నిర్బంధానికి సంబంధించిన వార్తలే తమను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు.
ప్రజల మనోభావాలను గౌరవించాలని… సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు అమె వెల్లడించారు. శాంతి, సుస్థిరతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
అటు కశ్మీర్‌ను విభజించిన నేపథ్యంలో పాక్ పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశ పరిచారు. అయితే సభ ప్రారంభంలోనే వాయిదా పడింది. సమావేశం ఏర్పాటు చేసి సభకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాకపోవడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. దాంతో సభను స్పీకర్ వెంటనే వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
కశ్మీర్ పరిణామాలపై ముస్లిం దేశాలతో ఇమ్రాన్ ఖాన్ సంప్రదింపులు జరిపినా వారి నుంచి పెద్దగా స్పందన రాలేదట. పాక్ దోస్త్ చైనా కూడా ఈ అంశంపై స్పందించేందుకు ఆసక్తి కనబరచడం లేదట. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ ఆలోచనలో పడ్డారని చెబుతున్నారు.