ఉత్తుత్తి స్వయంవరం.... నిజంగానే పెళ్లి
గతంలో స్వయంవరం ప్రకటించింది రాఖీసావంత్. తనను ఇంప్రెస్ చేసిన వాళ్లను పెళ్లాడతానని చాటింపు వేయించింది. అయితే అదంతా ఓ రియాలిటీ షోలో భాగంగా జరిగింది. అప్పట్నుంచి ఆమె పెళ్లిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు ఆ రూమర్లన్నీ నిజమయ్యాయి. రాఖీసావంత్ పెళ్లి చేసుకుంది. ఈసారి మాత్రం ఇది రియారిటీ షో కాదు. నిజంగానే ఆమె పెళ్లి చేసుకుంది. లండన్ కు చెందిన భారతీయ వ్యాపారవేత్త రితేష్ ను పెళ్లాడింది రాఖీసావంత్. అయితే ఈ పెళ్లి మేటర్ ను […]
గతంలో స్వయంవరం ప్రకటించింది రాఖీసావంత్. తనను ఇంప్రెస్ చేసిన వాళ్లను పెళ్లాడతానని చాటింపు వేయించింది. అయితే అదంతా ఓ రియాలిటీ షోలో భాగంగా జరిగింది. అప్పట్నుంచి ఆమె పెళ్లిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు ఆ రూమర్లన్నీ నిజమయ్యాయి. రాఖీసావంత్ పెళ్లి చేసుకుంది. ఈసారి మాత్రం ఇది రియారిటీ షో కాదు. నిజంగానే ఆమె పెళ్లి చేసుకుంది.
లండన్ కు చెందిన భారతీయ వ్యాపారవేత్త రితేష్ ను పెళ్లాడింది రాఖీసావంత్. అయితే ఈ పెళ్లి మేటర్ ను కూడా రియాలిటీ షో తలపించేలా సస్పెన్స్ మెయింటైన్ చేసింది. పెళ్లి మేటర్ చెప్పకుండా 3 రోజులుగా హనీమూన్ ఫొటోలు పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది రాఖీసావంత్. అవన్నీ అయిపోయిన తర్వాత తాపీగా ఈరోజు పెళ్లయిన విషయాన్ని బయటపెట్టింది.
ఇంతకీ ఈ రితేష్ ఎవరో తెలుసా? రాఖీ సావంత్ కు హార్డ్ కోర్ అభిమాని అట. రాఖీ సావంత్ కెరీర్ స్టార్ట్ చేసినప్పట్నుంచి ఆమెను ఫాలో అవుతున్నాడట. అప్పుడప్పుడు ఆమెతో వాట్సాప్ కూడా చేస్తుంటాడట. ఓ ఏడాదిగా బాగా క్లోజ్ అయ్యారు వీళ్లిద్దరు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం రాఖీ సావంత్ వయసు 40 ఏళ్లు.