370 రద్దుపై రాహుల్ వ్యాఖ్యలు
ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌ను విభజించిన తీరుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భారతదేశం ప్రాంతాల ఆధారంగా కాకుండా… ప్రజలతో ఏర్పడిన దేశం అన్న విషయం బీజేపీ పెద్దలు మరిచిపోయారని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా జాతీయ భద్రతనే ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు. National integration isn’t furthered by unilaterally tearing apart J&K, imprisoning elected representatives and violating […]
ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌ను విభజించిన తీరుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
భారతదేశం ప్రాంతాల ఆధారంగా కాకుండా… ప్రజలతో ఏర్పడిన దేశం అన్న విషయం బీజేపీ పెద్దలు మరిచిపోయారని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా జాతీయ భద్రతనే ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు.
National integration isn’t furthered by unilaterally tearing apart J&K, imprisoning elected representatives and violating our Constitution. This nation is made by its people, not plots of land.
This abuse of executive power has grave implications for our national security.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2019
కశ్మీర్ ప్రజా ప్రతినిధులను నిర్బంధంలో ఉంచి, అక్కడి ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని రాహుల్ విమర్శించారు.
Kashmir’s mainstream political leaders have been jailed at secret locations.
This is unconstitutional & undemocratic.
It’s also short sighted and foolish because it will allow terrorists to fill the leadership vaccum created by GOI.
The imprisoned leaders must be released.
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2019
అటు మమత కూడా కేంద్ర వైఖరిని తప్పుపట్టారు. కశ్మీర్ విషయంలో కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలకు తాము మద్దతు ఇవ్వబోమన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీలు వాకౌట్ చేశారు. బిల్లును వ్యతిరేకించలేక అటు సమర్ధించలేక తాము వెళ్లిపోతున్నామని టీఎంసీ ఎంపీలు ప్రకటించారు.