Telugu Global
National

కశ్మీర్‌ విభజనకు మేం మద్దతిస్తున్నాం...

కశ్మీర్ విభజనను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్వాగతించారు. లోక్‌సభలో కశ్మీర్ విభజన బిల్లుపై మాట్లాడిన జయదేవ్… 70 ఏళ్ల క్రితం జరిగిన తప్పును ఇప్పుడు సరిచేసినట్టు అయిందన్నారు.  కశ్మీర్ విభజనతో ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టికల్ 370 వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు. కశ్మీర్ విభజనకు, ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇస్తున్నట్టుగా ఇప్పటికే తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రకటించారన్నారు. ఒకే దేశం…ఒకే రాజ్యాంగం నినాదానికి టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. […]

కశ్మీర్‌ విభజనకు మేం మద్దతిస్తున్నాం...
X

కశ్మీర్ విభజనను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్వాగతించారు. లోక్‌సభలో కశ్మీర్ విభజన బిల్లుపై మాట్లాడిన జయదేవ్… 70 ఏళ్ల క్రితం జరిగిన తప్పును ఇప్పుడు సరిచేసినట్టు అయిందన్నారు. కశ్మీర్ విభజనతో ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నారు.

ఆర్టికల్ 370 వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు. కశ్మీర్ విభజనకు, ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇస్తున్నట్టుగా ఇప్పటికే తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రకటించారన్నారు. ఒకే దేశం…ఒకే రాజ్యాంగం నినాదానికి టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. కశ్మీర్‌లో కొత్త ప్రస్థానం మొదలైందన్నారు.

ఒకే దేశం, ఒకే జెండా నినాదం మంచిదేనని, ఇది తమకు కూడా సమ్మతమేనని వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

జమ్మూకశ్మీర్‌ విషయంలో దశాబ్దాల కల నెరవేరుతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని, కశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు తమ మద్దతు ఉంటుందని .. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతుందని రఘురామకృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  6 Aug 2019 5:47 AM GMT
Next Story