నేడు ప్రధాని, హోంమంత్రితో.... సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విడివిడిగా కలుస్తారు. మంగళవారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. అక్కడ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విడివిడిగా కలుస్తారు. మంగళవారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు.
అక్కడ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి రాష్ట్ర విభజన అనంతరం అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిస్తారు.
ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులపై చర్చించడంతో పాటు కాశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలుపుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. హోంమంత్రితో జరిగే ఈ భేటీకి జగన్మోహన్ రెడ్డి వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా ఉంటారు.
హోం మంత్రి తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులపై చర్చిస్తారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో చేపట్టిన కార్యక్రమాలపై కూడా మోడీకి వివరిస్తారని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రజలకు సురక్షితమైన మంచినీరు ఇచ్చే అంశం, ఇందుకు అవసరమైన నిధులపై కూడా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి వివరించే అవకాశాలున్నాయి.
పోలవరం టెండర్లు రద్దుతో పాటు విద్యుత్ ప్రాజెక్టులపై తాము చేపట్టదలచిన సమీక్షలపై కూడా మోడీతో జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.