పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే.... ప్రాణత్యాగానికైనా సిద్ధం
ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ ను రెండు రాష్టాలుగా విడగొట్టే బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అయిన అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు దేశసమగ్రతకు సంబంధించిన అంశమన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే కశ్మీర్ ను పాకిస్తాన్ లో అంతర్బాగంగా చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), చైనా ఆక్రమించిన ఆక్సాచిన్ కూడా భారత్ లో […]
ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ ను రెండు రాష్టాలుగా విడగొట్టే బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అయిన అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు దేశసమగ్రతకు సంబంధించిన అంశమన్నారు.
కాంగ్రెస్ తీరు చూస్తుంటే కశ్మీర్ ను పాకిస్తాన్ లో అంతర్బాగంగా చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), చైనా ఆక్రమించిన ఆక్సాచిన్ కూడా భారత్ లో అంతర్భాగమేనని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైతే తను ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఎప్పటికైనా పీవోకేను భారత్ దక్కించుకుంటుందని స్పష్టం చేశారు.
నిన్ననే రాష్ట్రపతి 370 ఆర్టికల్ ను రద్దు చేశారని.. రాజ్యసభలో ఆమోదించారని.. లోక్ సభలో కూడా ఆమోదించాలని కోరారు.
కశ్మీర్ ఎప్పటికే భారత్ లో అంతర్భాగమేనని.. ఈ విషయంలో పాకిస్తాన్, ఇతర ప్రపంచదేశాలు జోక్యం చేసుకోకుండా చేయడం కోసమే కశ్మీర్ ను విభజించి భారత్ లో అంతర్భాగం చేశామని అమిత్ షా చెప్పుకొచ్చారు.
ఇక ఈ బిల్లుతో కశ్మీర్ కు ఎంతో ప్రయోజనం అని..ఎన్నో పెట్టుబడులు వస్తాయని.. ఇతర దేశాలకు కశ్మీర్ తో సంబంధం లేకుండా చేశామని అమిత్ షా భావోద్వేగంగా ప్రసంగించారు. ఇక పార్లమెంట్ లో జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబాను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్, సీపీఐ పార్లమెంట్ నిరసన తెలిపి ప్రభుత్వాన్ని నిలదీశాయి.