Telugu Global
NEWS

టీ-20 లో రోహిత్ శర్మ సిక్సర్ల ప్రపంచ రికార్డు

గేల్ సిక్సర్ల రికార్డును అధిగమించిన రోహిత్ భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. అమెరికా గడ్డపై ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. విండీస్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉన్న 105 సిక్సర్ల ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. విండీస్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా..ఫ్లారిడాలోని లాడర్ హిల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో రోహిత్ ఈ ఘనతనుసొంతం చేసుకొన్నాడు. ప్రస్తుత సిరీస్ కు ముందు వరకూ..టీ-20 క్రికెట్లో అత్యధిక […]

టీ-20 లో రోహిత్ శర్మ సిక్సర్ల ప్రపంచ రికార్డు
X
  • గేల్ సిక్సర్ల రికార్డును అధిగమించిన రోహిత్

భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. అమెరికా గడ్డపై ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. విండీస్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉన్న 105 సిక్సర్ల ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు.

విండీస్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా..ఫ్లారిడాలోని లాడర్ హిల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో రోహిత్ ఈ ఘనతనుసొంతం చేసుకొన్నాడు.

ప్రస్తుత సిరీస్ కు ముందు వరకూ..టీ-20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల వరుస మూడో స్థానంలో కొనసాగిన రోహిత్ శర్మ… క్రిస్ గేల్ 105 సిక్సర్ల రికార్డును అధిగమించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.

విండీస్ తో రెండో టీ-20 మ్యాచ్ లో రోహిత్ 6 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 67 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రస్తుత సిరీస్ తొలి టీ-20లో 2 సిక్సర్లు, రెండో మ్యాచ్ లో 3 సిక్సర్లతో రోహిత్ మొత్తం 107 సిక్సర్లు సాధించినట్లయ్యింది.

గేల్ 105 సిక్సర్లతో రెండు, ..కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 103 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
తన కెరియర్ లో 96 టీ-20మ్యాచ్ లు ఆడిన రోహిత్ 4 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో సహా 2వేల 422 పరుగులు సాధించాడు. ఇందులో 107 సిక్సర్లు, 215 బౌండ్రీలు సైతం ఉన్నాయి.

First Published:  5 Aug 2019 5:14 AM GMT
Next Story