రాజ్యాంగాన్ని చించిన ఎంపీ... గెంటేయాలని చైర్మన్ ఆదేశం
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో రాజ్యసభలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పీడీపీకి చెందిన ఎంపీలు పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఎంపీలు బట్టలు చించుకుని నిరసన తెలిపారు. ఒక ఎంపీ ఏకంగా రాజ్యాంగాన్ని చించేశారు. చించి కాగితాలను గాల్లోకి ఎగరేశారు. దాంతో చైర్‌గా ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. సదరు ఎంపీని సభ నుంచి బయటకు తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. రాజ్యాంగాన్ని రాజ్యసభలోనే చించివేస్తారా… దీన్ని తాను అంగీకరించబోనని… […]
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో రాజ్యసభలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పీడీపీకి చెందిన ఎంపీలు పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఎంపీలు బట్టలు చించుకుని నిరసన తెలిపారు.
ఒక ఎంపీ ఏకంగా రాజ్యాంగాన్ని చించేశారు. చించి కాగితాలను గాల్లోకి ఎగరేశారు. దాంతో చైర్‌గా ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. సదరు ఎంపీని సభ నుంచి బయటకు తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు.
రాజ్యాంగాన్ని రాజ్యసభలోనే చించివేస్తారా… దీన్ని తాను అంగీకరించబోనని… వెంటనే సదరు ఎంపీని మార్షల్స్ వచ్చి బయటకు గెంటేయాల్సిందిగా ఆదేశించారు.