కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయానికి మద్దతిస్తున్నాం
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడాన్ని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి తాము మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం తర్వాతనైనా జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొని అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని తాము భావిస్తున్నామన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. We support the govt on its decisions on J & K. We hope this will bring peace and development in […]
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడాన్ని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి తాము మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.
ఈ నిర్ణయం తర్వాతనైనా జమ్ముకశ్మీర్‌లో శాంతి నెలకొని అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని తాము భావిస్తున్నామన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
We support the govt on its decisions on J & K. We hope this will bring peace and development in the state.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 5, 2019
ఈ బిల్లుకు అన్నాడీఎంకే, శివసేన, వైసీపీ, బిజూజనతాదల్, టీఆర్‌ఎస్, టీడీపీలు మద్దతు తెలిపాయి. కశ్మీర్ విషయంలో ఇదో చారిత్రాత్మక మార్పు అని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. త్వరలోనే కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని తాము ఆశిస్తున్నామన్నారు.