Telugu Global
National

దేశంలో తగ్గిన రాష్ట్రాల సంఖ్య

ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన వెంటనే కేంద్రం జమ్ముకశ్మీర్‌ను విభజించే బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందడం లాంచనంగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రత్యేక ప్రతిపత్తితో రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్‌ను… రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌ను, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీంతో దేశంలో ఇప్పటివరకు 29 రాష్ట్రాలు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 28కి తగ్గుతుంది. కేంద్ర […]

దేశంలో తగ్గిన రాష్ట్రాల సంఖ్య
X

ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన వెంటనే కేంద్రం జమ్ముకశ్మీర్‌ను విభజించే బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందడం లాంచనంగానే కనిపిస్తోంది.

ఇప్పటి వరకు ప్రత్యేక ప్రతిపత్తితో రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్‌ను… రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌ను, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

దీంతో దేశంలో ఇప్పటివరకు 29 రాష్ట్రాలు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు 28కి తగ్గుతుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రస్తుతం ఏడు ఉన్నాయి. లడక్‌, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత కేంద్రాలుగా ప్రకటించడంతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరనుంది.

First Published:  5 Aug 2019 7:47 AM IST
Next Story