Telugu Global
National

ఆర్టికల్ 370, 35ఏ రద్దు.... క్షణాల్లో గెజిట్ విడుదల

భారత దేశ చరిత్రలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రాష్ట్రపతి రద్దు చేశారు. రాజ్యసభలో 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదించిన కొన్ని నిమిషాలకే 370ని రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. గెజిట్ కూడా విడుదలైంది. దాంతో కశ్మీర్ ఇంతకాలం అనుభవిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అయింది. ఆర్టికల్‌ 370లో భాగంగా ఉన్నఆర్టికల్ 35ఏ కూడా రద్దు అయిపోయింది. జమ్ముకశ్మీర్‌ను కూడా విభజించారు. లడక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా […]

ఆర్టికల్ 370, 35ఏ రద్దు.... క్షణాల్లో గెజిట్ విడుదల
X

భారత దేశ చరిత్రలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రాష్ట్రపతి రద్దు చేశారు. రాజ్యసభలో 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదించిన కొన్ని నిమిషాలకే 370ని రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. గెజిట్ కూడా విడుదలైంది.

దాంతో కశ్మీర్ ఇంతకాలం అనుభవిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అయింది. ఆర్టికల్‌ 370లో భాగంగా ఉన్నఆర్టికల్ 35ఏ కూడా రద్దు అయిపోయింది. జమ్ముకశ్మీర్‌ను కూడా విభజించారు. లడక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌ ఉంటుంది.

1947లో కశ్మీర్‌ భారత్‌లో విలీనం అయినప్పుడు కశ్మీర్‌కు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు. విలీనం సమయంలో కేవలం రక్షణ, సమాచార, విదేశాంగ అంశాలపై మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు కట్టబెట్టారు. ఇతర భారత చట్టాలను కశ్మీర్‌లో అమలు చేయాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ అనుమతి తప్పనిసరి. ఆర్టికల్ 370 ఈ మేరకు కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోంది.

ఆర్టికల్ 370 ప్రకారం కశ్మీర్‌లో ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా భారత ప్రభుత్వానికి లేదు. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్‌ భారత్‌లో భాగం కాదన్న భావన కొందరిలో ఉంది. దీనికి తోడు ఆర్టికల్ 35ఏ కశ్మీర్ అసెంబ్లీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. శాశ్వత పౌరులు ఎవరు అన్నది నిర్ణయించే అధికారం కశ్మీర్ ప్రభుత్వానికే ఉంది.

కశ్మీర్‌యేతరులు అక్కడ భూములు కొనేందుకు లేదు. ఉద్యోగాలల్లో ఇతరులు చేరేందుకు వీలు లేదు. జమ్ము కశ్మీర్‌కు చెందిన మహిళలు శాశ్వత నివాసులు కాని వారిని పెళ్లి చేసుకుంటే సదరు మహిళకు కూడా శాశ్వతనివాసి హోదా కోల్పోతుంది. ఆస్తులపైనా అధికారం ఉండదు. ఆమె పిల్లలకు కూడా స్థానికత లభించదు. ఆస్తులపైనా సదరు మహిళ హక్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఆర్టికల్‌ 35ఏ రద్దు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా బీజేపీ చేస్తోంది.

First Published:  5 Aug 2019 12:53 AM GMT
Next Story