ఆర్టికల్ 370 రద్దు.... రాజ్యసభలో ప్రతిపాదన
జమ్ముకశ్మీర్ అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్‌లోని పరిస్థితిపై ప్రకటన చేసిన హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుకు ప్రతిపాదన చేశారు. కశ్మీర్ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో అమిత్ షా ఈ ప్రతిపాదన చేశారు. దాంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా సభలో ఆందోళనకు దిగారు. విపక్షాల నిరసన మధ్య జమ్ముకశ్మీర్‌లో ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును సిద్ధం చేశారు. కశ్మీర్‌లో యుద్దవాతావరణాన్ని సృష్టించారని… మాజీ ముఖ్యమంత్రులను హౌజ్ అరెస్ట్ చేశారని […]
జమ్ముకశ్మీర్ అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్‌లోని పరిస్థితిపై ప్రకటన చేసిన హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుకు ప్రతిపాదన చేశారు.
కశ్మీర్ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో అమిత్ షా ఈ ప్రతిపాదన చేశారు. దాంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా సభలో ఆందోళనకు దిగారు. విపక్షాల నిరసన మధ్య జమ్ముకశ్మీర్‌లో ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును సిద్ధం చేశారు.
కశ్మీర్‌లో యుద్దవాతావరణాన్ని సృష్టించారని… మాజీ ముఖ్యమంత్రులను హౌజ్ అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆజాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన అమిత్ షా విపక్షాల అనుమానాలన్నింటినీ తీరుస్తామని ప్రకటించారు.