Telugu Global
NEWS

అక్టోబర్ 17 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు !

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. అక్టోబర్ 17 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సిగ్నల్స్ అందాయి. మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారట. ఇందుకోసం ఇప్పటికే గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో పాటు గ్రామ వాలంటీర్ల నియామకం చురుగ్గా సాగుతోంది. ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు […]

అక్టోబర్ 17 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు !
X

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. అక్టోబర్ 17 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సిగ్నల్స్ అందాయి. మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారట. ఇందుకోసం ఇప్పటికే గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేస్తున్నారు.

ఇప్పటికే గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో పాటు గ్రామ వాలంటీర్ల నియామకం చురుగ్గా సాగుతోంది. ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.

సర్పంచ్ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత చివరగా మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వేసవిలోపు అన్ని ఎన్నికల ప్రక్రియలను ముగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు బ్రేక్ పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే వీలు ఉండదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నుంచి ఐదు నెలల లోపు త్వరగా ముగించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇందుకోసం పక్కా షెడ్యూల్ రూపొందిస్తోంది.

First Published:  5 Aug 2019 4:05 AM IST
Next Story