మీకు కాకపోతే ఇంకెవరికి చెబుతాను?
గత కొంతకాలంగా మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆఖరిగా 2017 లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మనోజ్ ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. తన అభిమానులు మాత్రం మంచు మనోజ్ తన తదుపరి సినిమాను ఎప్పుడు ప్రకటిస్తాడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఒక అభిమాని సోషల్ మీడియా ద్వారా అదే ప్రశ్న అడిగాడు. “అభిమానుల కోసం సినిమా అప్డేట్స్ లేమీ లేవు. మనోజ్ అన్నా ఎందుకు మూవీస్ చేయట్లేదు? మాకు […]
గత కొంతకాలంగా మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆఖరిగా 2017 లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మనోజ్ ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. తన అభిమానులు మాత్రం మంచు మనోజ్ తన తదుపరి సినిమాను ఎప్పుడు ప్రకటిస్తాడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఒక అభిమాని సోషల్ మీడియా ద్వారా అదే ప్రశ్న అడిగాడు. “అభిమానుల కోసం సినిమా అప్డేట్స్ లేమీ లేవు. మనోజ్ అన్నా ఎందుకు మూవీస్ చేయట్లేదు? మాకు సమాధానం చెప్పాల్సిందే” అని ఒక నెటిజన్ మంచు మనోజ్ ను నిలదీశాడు.
అయితే మంచు మనోజ్ ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు. “మీకు త్వరలోనే అన్నీ వివరిస్తాను. మీకు కాకపోతే ఇంకెవరికి చెబుతాను. కాకపోతే నాకు కొంచెం సమయం ఇవ్వండి. హృదయపూర్వకంగా మీకు థాంక్యూ, లవ్ యు ఆల్” అని రిప్లై ఇచ్చాడు మంచు మనోజ్. అభిమాని కామెంట్స్ కు రెస్పాన్స్ అయ్యాడు…. కానీ తన తదుపరి సినిమా గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మనోజ్.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ అసలు సినిమాలు మానేశాడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.