Telugu Global
NEWS

మెస్సీ పై మూడుమాసాల నిషేధం

సస్పెన్షన్ తో పాటు 50 వేల డాలర్ల జరిమానా నాలుగు మ్యాచ్ ల పాటు అర్జెంటీనా జట్టుకు దూరం ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీపై మూడుమాసాల నిషేధం వేటు పడింది. బ్రెజిల్ వేదికగా ముగిసిన కోపా అమెరికా కప్ సాకర్ టోర్నీ అవినీతిమయమంటూ మెస్సీ చేసిన వ్యాఖ్యలను నిర్వాహక సంఘం తీవ్రంగా పరిగణించింది. మెస్సీలాంటి ప్రపంచమేటి ఆటగాడు బాధ్యత మరచి నోటికొచ్చినట్లు వాగినందుకు నిర్వాహక సంఘం తగిన చర్య తీసుకొంది. బ్రెజిల్ కు […]

మెస్సీ పై మూడుమాసాల నిషేధం
X
  • సస్పెన్షన్ తో పాటు 50 వేల డాలర్ల జరిమానా
  • నాలుగు మ్యాచ్ ల పాటు అర్జెంటీనా జట్టుకు దూరం

ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీపై మూడుమాసాల నిషేధం వేటు పడింది. బ్రెజిల్ వేదికగా ముగిసిన కోపా అమెరికా కప్ సాకర్ టోర్నీ అవినీతిమయమంటూ మెస్సీ చేసిన వ్యాఖ్యలను నిర్వాహక సంఘం తీవ్రంగా పరిగణించింది.

మెస్సీలాంటి ప్రపంచమేటి ఆటగాడు బాధ్యత మరచి నోటికొచ్చినట్లు వాగినందుకు నిర్వాహక సంఘం తగిన చర్య తీసుకొంది.
బ్రెజిల్ కు అనుకూలంగా టోర్నీ… బ్రెజిల్ వేదికగా జరిగిన 2019 కోపా అమెరికా కప్ టోర్నీ సెమీఫైనల్లో బ్రెజిల్ చేతిలోనే అర్జెంటీనా 2-0 గోల్స్ తో ఓటమి చవిచూసింది.

బ్రెజిల్ ను విజేతగా నిలపడం కోసమే టోర్నీ నిర్వహించినట్లుగా ఉందని, అంతా అవినీతిమయమని తమ జట్టు ఓటమి అనంతరం
మెస్సీ మండిపడ్డాడు.

మూడోస్థానం కోసం జరిగిన పోటీలో చిలీపై 2-1 గోల్స్ తో అర్జెంటీనా విజయం సాధించిన తర్వాత మెస్సీ పలు అంశాల గురించి వాఖ్యానించడాన్ని.. దక్షిణ అమెరికా సాకర్ సమాఖ్య తీవ్రంగా పరిగణించింది.

విచారణ అనంతరం మూడుమాసాల నిషేధంతో పాటు 50వేల డాలర్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.

ఈ నిర్ణయంతో ..సెప్టెంబర్లో మెక్సికో, చిలీ జట్లతో జరగాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్ లకు మెస్సీ దూరం కానున్నాడు. తన వాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ.. దక్షిణ అమెరికా ఫుట్ బాల్ సంఘాన్ని మెస్సీ క్షమాపణలు కోరుతూ ఓ లేఖ పంపాడు.

First Published:  4 Aug 2019 4:08 AM IST
Next Story