Telugu Global
NEWS

టీ-20 సిరీస్ లో భారత్ బోణీ

హైస్కోరింగ్ గ్రౌండ్లో లోస్కోరింగ్ థ్రిల్లర్ నాలుగువికెట్ల గెలుపుతో భారత్ 1-0 ఆధిక్యం టీ-20 ప్రపంచ చాంపియన్ విండీస్ తో ప్రారంభమైన తీన్మార్ సిరీస్ లో మాజీ చాంపియన్ భారత్ బోణీ కొట్టింది. అమెరికాలోని లాడెర్ హిల్ స్టేడియం వేదికగా ముగిసిన తొలిసమరంలో భారత్ 4 వికెట్ల విజయం నమోదు చేసింది. బ్యాటింగ్ కు అంతగా అనువుకాని లాడెర్ హిల్ వికెట్ పై భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు. సైనీ అరంగేట్రం […]

టీ-20 సిరీస్ లో భారత్ బోణీ
X
  • హైస్కోరింగ్ గ్రౌండ్లో లోస్కోరింగ్ థ్రిల్లర్
  • నాలుగువికెట్ల గెలుపుతో భారత్ 1-0 ఆధిక్యం

టీ-20 ప్రపంచ చాంపియన్ విండీస్ తో ప్రారంభమైన తీన్మార్ సిరీస్ లో మాజీ చాంపియన్ భారత్ బోణీ కొట్టింది. అమెరికాలోని లాడెర్ హిల్ స్టేడియం వేదికగా ముగిసిన తొలిసమరంలో భారత్ 4 వికెట్ల విజయం నమోదు చేసింది.

బ్యాటింగ్ కు అంతగా అనువుకాని లాడెర్ హిల్ వికెట్ పై భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

సైనీ అరంగేట్రం అదుర్స్..

భారత అరంగేట్రం హీరో, యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా… కరీబియన్ టీమ్ ను కోలుకోనివ్వకుండా చేశాడు.

విండీస్ ఆటగాళ్లలో సీనియర్ ఆల్ రౌండర్ కీరాన్ పోలార్డ్ 2 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
కరీబియన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత టాప్ స్కోరర్ రోహిత్…

96 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ సైతం ప్రారంభ ఓవర్లలో తడబడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 2 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

కెప్టెన్ విరాట్ కొహ్లీ 19, మనీష్ పాండే 19, కృణాల్ పాండ్యా 12, జడేజా 10 పరుగులు చేయగా… రిషభ్ పంత్ డకౌటయ్యాడు. చివరకు భారత్ 17.2 ఓవర్లలో 6 వికెట్లకు 96 పరుగుల లక్ష్యం చేరుకొంది. 4 వికెట్ల విజయంతో … మూడుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో పైచేయి సాధించింది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

First Published:  4 Aug 2019 3:30 AM IST
Next Story