Telugu Global
NEWS

తాగాలంటే ఇంటికెళ్లే తాగాలి...

ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో మరో కీలక అంశాన్ని పొందుపరిచింది. ఇకపై మద్యం షాపుల వద్దే మందు కొట్టే అవకాశాన్ని రద్దు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రతి మద్యం షాపు వద్ద ఒక పర్మిట్ రూం నిర్వాహణకు అవకాశం ఇచ్చారు. దాంతో మద్యం కొన్న వారు అక్కడే తాగేసి వెళ్లే వారు. కొన్ని చోట్ల షాపు ముందే తాగుతూ, రోడ్లపైనే మందుబాబులు అడ్డుగా నిలబడేవారు. దీని వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో […]

తాగాలంటే ఇంటికెళ్లే తాగాలి...
X

ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో మరో కీలక అంశాన్ని పొందుపరిచింది. ఇకపై మద్యం షాపుల వద్దే మందు కొట్టే అవకాశాన్ని రద్దు చేస్తోంది.

ఇప్పటి వరకు ప్రతి మద్యం షాపు వద్ద ఒక పర్మిట్ రూం నిర్వాహణకు అవకాశం ఇచ్చారు. దాంతో మద్యం కొన్న వారు అక్కడే తాగేసి వెళ్లే వారు. కొన్ని చోట్ల షాపు ముందే తాగుతూ, రోడ్లపైనే మందుబాబులు అడ్డుగా నిలబడేవారు. దీని వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పర్మిట్ రూంలను రద్దు చేస్తోంది. అక్టోబర్ నుంచి ప్రభుత్వ సిబ్బందే మద్యం షాపులను నడపనున్న నేపథ్యంలో పర్మిట్ రూంలు రద్దు చేశారు. ఇకపై మద్యం తాగాలి అనుకునే వారు తీసుకెళ్లి ఇంటి వద్దే తాగాల్సి ఉంటుంది. మద్యం షాపు వద్దే మందుకొడతామంటే కుదరదు. ఇంటి వద్ద తాగలేని వారు బార్‌లలో తాగొచ్చు. అంతేకానీ షాపు వద్దే తాగి రోడ్ల మీద ఊగుతూ వెళ్లే అవకాశం ఉండదు.

ఈ నిర్ణయం వల్ల మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పైగా మద్యం షాపుల వద్దే మందు కొట్టే వెసులుబాటు వల్ల కల్తీకి అవకాశం ఏర్పడుతోంది. మద్యం ప్రియులు అడిగిన మేరకు మద్యం ఇచ్చే ఉద్దేశంలో బాటిల్‌ను షాపు సిబ్బంది ఓపెన్ చేసి దాన్ని ఇద్దరుముగ్గురికి పంచుతున్నారు. దాని వల్ల కల్తీకి అవకాశం ఏర్పడుతోంది. ఇప్పుడు షాపు వద్ద తాగే అవకాశం లేకుండా చేయడం వల్ల సిబ్బంది బాటిళ్లను ఓపెన్ చేసే అవసరం కూడా ఉండదు.

First Published:  3 Aug 2019 10:30 PM GMT
Next Story