Telugu Global
NEWS

తిరుమలలో మరో కీలక నిర్ణయం

తిరుమలలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది టీటీడీ. ఇప్పటీకే ఎల్‌ దర్శనాలను రద్దు చేయడం ద్వారా సామాన్యులకు త్వరగా స్వామి దర్శనం కలిగే వీలు కల్పించింది. తదుపరి చర్యల్లో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్‌పై వేటు వేయబోతోంది. ఈనెల మూడో వారం నుంచి తిరుమలలో ప్లాస్టిక్ లడ్డూ కవర్ల వాడకాన్ని నిలిపివేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జనపనార సంచులు (జూట్‌ కవర్లు) వాడాలని నిర్ణయించినట్టు టీటీడీ ఈవో చెప్పారు. ఇప్పటికే గత నెలలో మూడు రోజుల […]

తిరుమలలో మరో కీలక నిర్ణయం
X

తిరుమలలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది టీటీడీ. ఇప్పటీకే ఎల్‌ దర్శనాలను రద్దు చేయడం ద్వారా సామాన్యులకు త్వరగా స్వామి దర్శనం కలిగే వీలు కల్పించింది. తదుపరి చర్యల్లో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్‌పై వేటు వేయబోతోంది. ఈనెల మూడో వారం నుంచి తిరుమలలో ప్లాస్టిక్ లడ్డూ కవర్ల వాడకాన్ని నిలిపివేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.

ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జనపనార సంచులు (జూట్‌ కవర్లు) వాడాలని నిర్ణయించినట్టు టీటీడీ ఈవో చెప్పారు. ఇప్పటికే గత నెలలో మూడు రోజుల పాటు జూట్‌ బ్యాగుల సాయంతో లడ్డూలను పంపిణీ చేసి భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జూట్ బ్యాగుల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పూర్తి స్థాయిలో అమలు దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.

జూట్ బ్యాగుల సరఫరా కోసం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపారు. ఈనెల మూడో వారం నుంచి పూర్తి స్థాయిలో జూట్ బ్యాగులను వాడనున్నారు.

First Published:  3 Aug 2019 3:45 AM IST
Next Story