Telugu Global
NEWS

సచిన్ , కొహ్లీలను అధిగమించిన స్టీవ్ స్మిత్

అతితక్కువ ఇన్నింగ్స్ లోనే స్మిత్ 24 టెస్ట్ శతకాలు సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్ ప్రపంచ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కొహ్లీని ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అధిగమించాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అతితక్కువ ఇన్నింగ్స్ లోనే 24 సెంచరీలు బాదిన రెండో క్రికెటర్ గా స్టీవ్ స్మిత్ రికార్డుల్లో చేరాడు. బర్మింగ్ హామ్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా […]

సచిన్ , కొహ్లీలను అధిగమించిన స్టీవ్ స్మిత్
X
  • అతితక్కువ ఇన్నింగ్స్ లోనే స్మిత్ 24 టెస్ట్ శతకాలు
  • సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్

ప్రపంచ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కొహ్లీని ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అధిగమించాడు.

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో అతితక్కువ ఇన్నింగ్స్ లోనే 24 సెంచరీలు బాదిన రెండో క్రికెటర్ గా స్టీవ్ స్మిత్ రికార్డుల్లో చేరాడు.
బర్మింగ్ హామ్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో ప్రారంభమైన యాషెస్ సిరీస్ తొలిటెస్ట్ తొలిరోజు ఆటలో స్టీవ్ స్మిత్
ఫైటింగ్ సెంచరీ సాధించాడు.

పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన తన జట్టును 144 పరుగుల స్కోరుతో ఆదుకొన్నాడు. ఈ క్రమంలో…అతితక్కువ ఇన్నింగ్స్ లోనే టెస్ట్ క్రికెట్ 24వ శతకం బాదిన రెండో క్రికెటర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

డాన్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్…

142 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో…కేవలం 66 ఇన్నింగ్స్ లోనే 24 సెంచరీలు బాదిన ఒకే ఒక్కడు సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ కాగా…
ఆ తర్వాతి స్థానాన్ని స్టీవ్ స్మిత్ ఆక్రమించాడు.

తన కెరియర్ లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 9వ శతకం బాదడం ద్వారా స్మిత్ మరో ఘనతను సైతం దక్కించుకొన్నాడు. స్మిత్ కేవలం 118 ఇన్నింగ్స్ లోనే టెస్ట్ క్రికెట్ 24వ సెంచరీ సాధించడం విశేషం.

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ 123 ఇన్నింగ్స్ లోనూ, మాస్టర్ సచిన్ 125, సునీల్ గవాస్కర్ 128 ఇన్నింగ్స్ లోనూ తమ కెరియర్ 24వ శతకాలు సాధించారు.

టెస్ట్ క్రికెట్లో 24 శతకాలు బాదిన గ్రెగ్ చాపెల్, వివియన్ రిచర్డ్స్, మహ్మద్ యూసుఫ్ ల సరసన స్టీవ్ స్మిత్ వచ్చి చేరాడు.

ఇంగ్లండ్ పై స్మిత్ సూపర్ షో… టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ పై 9వ శతకం బాదిన స్టీవ్ స్మిత్ కేవలం 42 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు.

యాషెస్ గత ఏడుటెస్టుల్లో స్టీవ్ స్మిత్ ఐదు శతకాలు సాధించడం కూడా మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

First Published:  3 Aug 2019 5:21 AM IST
Next Story