Telugu Global
NEWS

సౌరవ్ గంగూలీ చీఫ్ కోచ్ కలలు

ఏనాటికైనా చీఫ్ కోచ్ అవుతానంటున్న దాదా ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు నిర్వహించే చీఫ్ కోచ్ ఇంటర్వూలో పాల్గొనాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కలలు కంటున్నాడు. ఏనాటికైనా భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడుగా బాధ్యతలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. భారత క్రికెట్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా మాత్రమే కాదు..దూకుడుగా క్రికెట్ ఆడటం నేర్పిన సౌరవ్ గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం చైర్మన్ గా, క్రికెట్ వ్యాఖ్యాతగా, ఐపీఎల్ లో ఢిల్లీ ఫ్రాంచైజీ మెంటార్ […]

సౌరవ్ గంగూలీ చీఫ్ కోచ్ కలలు
X
  • ఏనాటికైనా చీఫ్ కోచ్ అవుతానంటున్న దాదా

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు నిర్వహించే చీఫ్ కోచ్ ఇంటర్వూలో పాల్గొనాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కలలు కంటున్నాడు. ఏనాటికైనా భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడుగా బాధ్యతలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు.

భారత క్రికెట్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా మాత్రమే కాదు..దూకుడుగా క్రికెట్ ఆడటం నేర్పిన సౌరవ్ గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం చైర్మన్ గా, క్రికెట్ వ్యాఖ్యాతగా, ఐపీఎల్ లో ఢిల్లీ ఫ్రాంచైజీ మెంటార్ గా బహుముఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

భారత క్రికెట్ కు ప్రధాన శిక్షకుడిగా సేవలు అందించాలన్నది తన లక్ష్యమని…అయితే …ఇప్పటికి ఇప్పుడు మాత్రమేకాదని తేల్చిచెప్పాడు.

విండీస్ తో టీ-20 సిరీస్ అంత తేలిక కాదు…

విండీస్ తో తీన్మార్ టీ-20 సిరీస్ భారత్ కు అంతతేలిక కాదని…స్వదేశంలో కరీబియన్ టీమ్ ను మించిన బలమైన ప్రత్యర్థి మరొకటి లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

భారత ప్రస్తుత చీఫ్ కోచ్ రవి శాస్త్రి పనితీరు గురించి వ్యాఖ్యానించడానికి సౌరవ్ గంగూలీ నిరాకరించాడు. రవి శాస్త్రి పనితీరు గురించి మాట్లాడటానికి ఇది తగిన సమయం కాదని అన్నాడు.

స్టీవ్ స్మిత్ కు హ్యాట్సాఫ్….

బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది సస్పెన్ష్ తో క్రికెట్ కు దూరమైన ఆస్ట్ర్లేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్…యాషెస్ సిరీస్ తొలిటెస్టులోనే ఫైటింగ్ సెంచరీ సాధించడం…అతని సత్తాకు, క్లాస్ కు నిదర్శనమని గంగూలీ అన్నాడు.

First Published:  3 Aug 2019 3:26 PM IST
Next Story