గేల్ సిక్సర్ల రికార్డుకు రోహిత్ గురి
విండీస్ తో తొలి టీ-20కి రోహిత్ రెడీ అమెరికాగడ్డపై విండీస్ తో టీ-20 సమరం భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ..అమెరికా గడ్డపై ఓ అరుదైన రికార్డుకు ఉరకలేస్తున్నాడు. విండీస్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా.. ఫ్లారిడాలోని లాడర్ హిల్ స్టేడియం వేదికగా జరిగే రెండు మ్యాచ్ ల్లోనే.. క్రిస్ గేల్ పేరుతో ఉన్న 105 సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ-20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల వరుసలో […]
- విండీస్ తో తొలి టీ-20కి రోహిత్ రెడీ
- అమెరికాగడ్డపై విండీస్ తో టీ-20 సమరం
భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ..అమెరికా గడ్డపై ఓ అరుదైన రికార్డుకు ఉరకలేస్తున్నాడు. విండీస్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా.. ఫ్లారిడాలోని లాడర్ హిల్ స్టేడియం వేదికగా జరిగే రెండు మ్యాచ్ ల్లోనే.. క్రిస్ గేల్ పేరుతో ఉన్న 105 సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీ-20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల వరుసలో రోహిత్ శర్మ ప్రస్తుతం 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. క్రిస్ గేల్ 105 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిస్తే… కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 103 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 102 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
విండీస్ తో ఆగస్టు 3, 4, 6 తేదీలలో జరిగే మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు గేల్ దూరంగా ఉన్నాడు. రోహిత్ శర్మ మాత్రం ఈ మూడు మ్యాచ్ ల్లోనూ పాల్గొనడం ద్వారా గేల్ పేరుతో ఉన్న 105 సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంగ్లండ్ వేదికగా కొద్దివారాల క్రితమే ముగిసిన వన్డే ప్రపంచకప్ లో రోహిత్ శర్మ ఏకంగా ఐదు సెంచరీలు బాదడం ద్వారా ప్రపంచకప్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.