Telugu Global
National

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

భారీగా అక్రమాలు జరిగాయని నిపుణుల కమిటీ తేల్చడంతో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు నుంచి నవయుగను తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ పరిమాణంపై కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ లోక్‌సభలో స్పందించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి… పోలవరం నిర్మాణం నుంచి కాంట్రాక్టర్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు. ఈ నిర్ణయం వల్ల పోలవరం నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. తాజా పరిణామం […]

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
X

భారీగా అక్రమాలు జరిగాయని నిపుణుల కమిటీ తేల్చడంతో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు నుంచి నవయుగను తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ పరిమాణంపై కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ లోక్‌సభలో స్పందించారు.

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి… పోలవరం నిర్మాణం నుంచి కాంట్రాక్టర్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు. ఈ నిర్ణయం వల్ల పోలవరం నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు.

తాజా పరిణామం వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందో చెప్పలేనన్నారు. కొత్తగా టెండర్ల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

First Published:  3 Aug 2019 3:10 AM IST
Next Story