నిమ్మగడ్డను వదిలిపెట్టిన సెర్బియా పోలీసులు
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఇటీవల సెర్బియా రాజధానిలోని బెల్‌గ్రేడ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వాన్‌పిక్ వ్యవహారంలో రస్‌అల్ ఖైమా జారీ చేయించిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా బిల్‌గ్రేడ్ పోలీసులు నిమ్మగడ్డను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం పోలీసులు ఆయన్ను వదిలిపెట్టారు. ఈ విషయాన్ని ప్రసాద్ తరపు న్యాయవాది ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం నిమ్మగడ్డ ప్రసాద్‌ను బెల్‌గ్రేడ్ పోలీసులు విడుదల చేశారని ప్రకటించారు. నిమ్మగడ్డ ప్రసాద్ ప్రస్తుతం ఎక్కడికైనా ప్రయాణం […]
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఇటీవల సెర్బియా రాజధానిలోని బెల్‌గ్రేడ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వాన్‌పిక్ వ్యవహారంలో రస్‌అల్ ఖైమా జారీ చేయించిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా బిల్‌గ్రేడ్ పోలీసులు నిమ్మగడ్డను అరెస్ట్ చేశారు.
విచారణ అనంతరం పోలీసులు ఆయన్ను వదిలిపెట్టారు. ఈ విషయాన్ని ప్రసాద్ తరపు న్యాయవాది ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం నిమ్మగడ్డ ప్రసాద్‌ను బెల్‌గ్రేడ్ పోలీసులు విడుదల చేశారని ప్రకటించారు. నిమ్మగడ్డ ప్రసాద్ ప్రస్తుతం ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చని వివరించారు.
నిమ్మగడ్డ ప్రసాద్ తన పని ముగించుకుని భారత్‌కు తిరుగు పయణం అవుతారని చెప్పారు. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు సీబీఐ కోర్టులో ఆగస్ట్ రెండు వరకు నిమ్మగడ్డ ప్రసాద్ అనుమతి తీసుకున్నారు. కానీ సెర్బియా పోలీసుల చర్య నేపథ్యంలో నిమ్మగడ్డ భారత్‌కు రావడం ఆలస్యం అయిందని కోర్టుకు అతడి తరపు న్యాయవాదులు వివరించారు.