కశ్మీర్ ఉద్రిక్తత... విద్యార్థులకు కేటీఆర్ భరోసా
కశ్మీర్ లో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసేందుకు అవకాశం ఉందంటూ అమర్‌నాథ్ యాత్రికులను తిరిగి వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వేల మందితో మిలటరీ… లోయలో తిష్టవేసింది. Any student/parent wanting assistance, please call our Resident Commissioner Sri Vedantam Giri at 011-2338 2041 or on his mobile +91 99682 99337 at Telangana Bhavan, New Delhi — KTR (@KTRTRS) […]
కశ్మీర్ లో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులు దాడులు చేసేందుకు అవకాశం ఉందంటూ అమర్‌నాథ్ యాత్రికులను తిరిగి వెళ్లిపోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వేల మందితో మిలటరీ… లోయలో తిష్టవేసింది.
Any student/parent wanting assistance, please call our Resident Commissioner Sri Vedantam Giri at 011-2338 2041 or on his mobile +91 99682 99337 at Telangana Bhavan, New Delhi
— KTR (@KTRTRS) August 3, 2019
ఈ పరిణామంపై కశ్మీర్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కేంద్ర హోంశాఖ గానీ, ఆ రాష్ట్ర గవర్నర్‌గాని స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆ రాష్ట్ర పార్టీలు ఆరోపిస్తున్నాయి. అసలు కశ్మీర్‌లో ఏం చేయబోతున్నారో చెప్పాలంటూ ఓమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
మరోవైపు శ్రీనగర్ ఎన్‌ఐటీ విద్యార్థులకు కూడా ఇదే తరహా ఆదేశాలు వచ్చాయి. ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఎన్‌ఐటీని ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు వచ్చాయి. దాంతో పలువురు తెలంగాణ విద్యార్థులు కేటీఆర్‌ను సాయం కోరారు. తనకు ట్విట్టర్ లో పలు విజ్ఞప్తులు వస్తున్నాయని వాటిని పరిశీలిస్తునట్టు కేటీఆర్ చెప్పారు. అధికారులను అలర్ట్ చేశామన్నారు.
అధికారులు త్వరలోనే అక్కడికి చేరుకుని విద్యార్థులకు అవసరమైన సాయం అందిస్తారని వెల్లడించారు. ఏదైనా తక్షణ సాయం కావాలంటే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు కేటీఆర్.