Telugu Global
National

టికెట్ రూ. 9 ... క‌డుతున్న‌ది రూ.15 ల‌క్ష‌లు!

గుజ‌రాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేష‌న్ (జిఎస్ఆర్ టీసీ)లో ప‌నిచేస్తున్న ఓ కండ‌క్ట‌ర్ ప్ర‌యాణికుని ద‌గ్గ‌ర 9రూపాయ‌లు తీసుకుని టికెట్ కొట్ట‌లేదు. అందుకు ఆ సంస్థ అత‌డిపై చ‌ర్య తీసుకుంది. దాని విలువ 15 ల‌క్ష‌ల రూపాయ‌లు! అది 25జులై, 2003. చంద్ర‌కాంత్ ప‌టేల్…. చిక్ హ్లి నుంచి అంబాచ్ గ్రామానికి న‌డిచే బ‌స్‌కి క‌డ‌క్ట‌ర్‌గా డ్యూటీలో ఉన్నాడు. హ‌టాత్తుగా ఆ బ‌స్‌ని ఆపి టికెట్ క‌లెక్ట‌ర్ చెక్ చేశాడు. ఒక ఆసామి ద‌గ్గ‌ర టికెట్ […]

టికెట్ రూ. 9 ... క‌డుతున్న‌ది రూ.15 ల‌క్ష‌లు!
X

గుజ‌రాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేష‌న్ (జిఎస్ఆర్ టీసీ)లో ప‌నిచేస్తున్న ఓ కండ‌క్ట‌ర్ ప్ర‌యాణికుని ద‌గ్గ‌ర 9రూపాయ‌లు తీసుకుని టికెట్ కొట్ట‌లేదు. అందుకు ఆ సంస్థ అత‌డిపై చ‌ర్య తీసుకుంది. దాని విలువ 15 ల‌క్ష‌ల రూపాయ‌లు!

అది 25జులై, 2003. చంద్ర‌కాంత్ ప‌టేల్…. చిక్ హ్లి నుంచి అంబాచ్ గ్రామానికి న‌డిచే బ‌స్‌కి క‌డ‌క్ట‌ర్‌గా డ్యూటీలో ఉన్నాడు. హ‌టాత్తుగా ఆ బ‌స్‌ని ఆపి టికెట్ క‌లెక్ట‌ర్ చెక్ చేశాడు. ఒక ఆసామి ద‌గ్గ‌ర టికెట్ క‌నిపించ‌లేదు.

టికెట్ ఎందుకు తీసుకోలేద‌ని అడిగితే… తొమ్మిది రూపాయ‌లు తీసుకుని కండ‌క్ట‌ర్ టికెట్ ఇవ్వ‌లేద‌ని ఆ ఆసామి అన్నాడ‌ట‌. దీంతో అధికార్లు కండ‌క్ట‌ర్‌ పై విచార‌ణ నిర్వ‌హించి అత‌డు త‌ప్పు చేశాడ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

అత‌డు తీసుకుంటున్న జీతానిక‌న్నా రెండు వంతుల త‌క్కువ‌ జీతాన్ని స‌ర్వీసులో ఉన్నంత కాలం తీసుకోవాల‌నేది అత‌డికి అధికార్లు విధించిన శిక్ష‌.

అంటే రిటైర్మెంట్ వ‌ర‌కు అత‌డు త‌గ్గించిన జ‌తాన్నే తీసుకోవాలి. జీతం పెర‌గ‌దు, త‌ర‌గ‌దు. ఈ శిక్ష మ‌రీ ఎక్కువ‌ని అత‌డు న‌వ‌స‌రిలోని ఇండ‌స్ట్రియ‌ల్ ట్రిబ్యున‌ల్ కి, ఆ త‌ర్వాత గుజ‌రాత్ హైకోర్టుకి వెళ్ళాడు.

అత‌డి లాయ‌ర్ కోర్టులో వాదిస్తూ… త‌న క్ల‌యింట్‌కి విధించిన శిక్ష మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని, ఉన్న జీతాన్ని త‌గ్గించి, అదే జీతాన్నిఅత‌డి 37 ఏండ్ల స‌ర్వీసు అంతా తీసుకోమ‌న‌డం అన్యాయం అని వాదించాడు. స‌ర్వీసు మొత్తంలో అత‌డు 15 ల‌క్ష‌ల రూపాయ‌లు కోల్పోతాడ‌ని లెక్క‌లు తేల్చాడు.

అయితే కోర్టులో జిఎస్ఆర్‌ టీసీ న్యాయ‌వాది ఈ కండ‌క్ట‌ర్ ఇలాగే డ‌బ్బులు తీసుకుని టికెట్ కొట్ట‌కుండా ఇప్ప‌టికే 35 సార్లు చెకింగ్‌లో దొరికాడ‌ని, ప‌ట్టుబ‌డిన ప్ర‌తిసారి చిన్న చిన్న జ‌రిమానాలు, హెచ్చ‌రిక‌ల‌తో వ‌దిలేశారని, ఇక ఎంత‌మాత్రం అత‌డ్ని ఉపేక్షించేది లేద‌ని చెప్పాడు. దీంతో కోర్టు ప‌టేల్ పిటిష‌న్‌ని తిర‌స్క‌రించింది.

First Published:  3 Aug 2019 8:08 AM IST
Next Story