తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ రాజీనామా
టీడీపీ అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా వెలుగులోకి వచ్చిన ఆయన పోటీ చేసిన తొలి ఎన్నికలోనే ఓడిపోవడంతో తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకున్నారు. దేవినేని అవినాష్‌తో పాటు సీనియర్ టీడీపీ నేత కడియాల బుచ్చిబాబు, పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు రాజీనామా చేశారు. కాగా, గత ఎన్నికల్లో గుడివాడ నుంచి నాని మీద పోటీ చేసిన అవినాష్.. […]
టీడీపీ అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా వెలుగులోకి వచ్చిన ఆయన పోటీ చేసిన తొలి ఎన్నికలోనే ఓడిపోవడంతో తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకున్నారు.
దేవినేని అవినాష్‌తో పాటు సీనియర్ టీడీపీ నేత కడియాల బుచ్చిబాబు, పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు రాజీనామా చేశారు. కాగా, గత ఎన్నికల్లో గుడివాడ నుంచి నాని మీద పోటీ చేసిన అవినాష్.. నానీ ద్వారానే ఇప్పుడు వైసీపీలోనికి రాబోతున్నట్లు సమాచారం.
కాగా, అవినాష్ అనుచరులు ఆయన వైసీపీలో చేరే విషయంపై స్పష్టత నిచ్చారు. సీఎం వైఎస్ జగన్ జెరుసలేం పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అవినాష్ సీఎం సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా దివంగత దేవినేని నెహ్రు అనుచరులు కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం.
ఇక అవినాష్ వైసీపీలో చేరితే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి పదవి ఇస్తామని హామీ లభించినట్లు తెలుస్తోంది.
మరో వైపు బోండా ఉమ కూడా ఈ పదవిని ఆశించి వైసీపీలోకి వద్దామని బాగా ట్రై చేశాడని…. కానీ అటువైపు నుంచి ఎవరూ స్పందించకపోవడంతో ఉమ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.