Telugu Global
NEWS

గ్రేటర్ లో సభ్యత్వం డల్.... నేతలకు కేటీఆర్ క్లాస్ !

గ్రేటర్ హైదరాబాద్ నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ ఇతర జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో ఒకటే ఎజెండా. సభ్యత్వ నమోదు ఎందుకు డల్ గా ఉందని ఆయన నేతలను ప్రశ్నించారు. గ్రేటర్ లో చూసుకుంటే ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగతా ప్రాంతాల్లో మెంబర్ షిప్ డల్ గా ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ భవన వర్గాల సమాచారం ప్రకారం మంత్రి […]

గ్రేటర్ లో సభ్యత్వం డల్.... నేతలకు కేటీఆర్ క్లాస్ !
X

గ్రేటర్ హైదరాబాద్ నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ ఇతర జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో ఒకటే ఎజెండా. సభ్యత్వ నమోదు ఎందుకు డల్ గా ఉందని ఆయన నేతలను ప్రశ్నించారు.

గ్రేటర్ లో చూసుకుంటే ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగతా ప్రాంతాల్లో మెంబర్ షిప్ డల్ గా ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ భవన వర్గాల సమాచారం ప్రకారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్న సనత్ నగర్ లో సభ్యత్వ నమోదుకు స్పందన కరువైందట. కేవలం 20 నుంచి 25వేల మంది మాత్రమే మెంబర్ షిప్ జాయిన్ అయ్యారట.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లో కూడా ఇదే పరిస్థితి . అక్కడ కేవలం 20 వేల లోపే మెంబర్ షిప్ అయిందట. గ్రేటర్ బయట నియోజకవర్గాల్లో చూస్తూ 70 వేల సభ్యత్యాలు దాటాయి. రాజధాని నగరంలో మాత్రం సభ్యత్వ నమోదుకు స్పందన కరువైందట.

పాతబస్తీలోని నియోజవర్గాలు అయితే అసలు సభ్వత్వ నమోదు ముచ్చటే కనిపించడం లేదట. అక్కడ తిప్పితిప్పి కొడితే నియోజకవర్గానికి ఐదు వేల సభ్యత్వాల లోపే నమోదు అయ్యాయని టీఆర్ఎస్ భవన్ లో నమోదైన లెక్కలు చెబుతున్నాయి.

మెంబర్ షిప్ డ్రైవ్ ను పట్టించుకోకపోవడంపై నేతలపై కేటీ ఆర్ సీరియస్ అయ్యారట. బోనాల పండగ వల్ల కొత్త సభ్యత్వం డల్ అయిందని…పదిరోజుల టైమ్ ఇవ్వమని నేతలు కోరారట. ఇటు కేటీఆర్ కూడా ఈ నెల 6 నుంచి రంగంలోకి దిగుతున్నారు. సభ్యత్వ నమోదు పెంచేందుకు హైదరాబాద్ లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారట.

సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలవడంతో టీఆర్ఎస్ లో కొత్త ఊపు తగ్గిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఆ ఇద్దరు గెలవడం వల్ల గ్రేటర్ లో కొంచెం పోటీ ఏర్పడిందని అంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల నాటికి ఈ ఇద్దరు నేతలు ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటు రాజకీయ కారణాలు..అటు పార్టీలో జోష్ లేకపోవడం…నేతలు పట్టించుకోకపోవడంతో…గ్రేటర్ లో టీఆర్ఎస్ సభ్యత్వం తగ్గిందనేది మాత్రం వాస్తవం.

First Published:  1 Aug 2019 8:22 PM GMT
Next Story