కాజల్ కోసం 60లక్షలు పోగొట్టుకున్న పారిశ్రామికవేత్త
హీరోయిన్ కాజల్ కోసం ఒక యువ పారిశ్రామికవేత్త 60లక్షలు పోగొట్టుకుని మోసపోయాడు. చివరకు మోసగాళ్ల బ్లాక్ మెయిల్‌కు భయపడి ఇల్లు వదిలి పారిపోయాడు. అతడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో యువ పారిశ్రామికవేత్త ఎందుకు పారిపోయాడన్న విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త కుమారుడికి హీరోయిన్ కాజల్ అంటే పిచ్చి. ఒకసారి ఇంటర్నెట్‌లో సోధిస్తుండగా మీకు ఇష్టమైన హీరోయిన్‌తో గడపాలంటే తమను సంప్రదించండి అంటూ లింక్ కనిపించింది. దాన్ని క్లిక్ చేసిన పారిశ్రామికవేత్త కుమారుడు… సైట్ నిర్వాహకులు […]
హీరోయిన్ కాజల్ కోసం ఒక యువ పారిశ్రామికవేత్త 60లక్షలు పోగొట్టుకుని మోసపోయాడు. చివరకు మోసగాళ్ల బ్లాక్ మెయిల్‌కు భయపడి ఇల్లు వదిలి పారిపోయాడు. అతడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో యువ పారిశ్రామికవేత్త ఎందుకు పారిపోయాడన్న విషయం వెలుగులోకి వచ్చింది.
చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త కుమారుడికి హీరోయిన్ కాజల్ అంటే పిచ్చి. ఒకసారి ఇంటర్నెట్‌లో సోధిస్తుండగా మీకు ఇష్టమైన హీరోయిన్‌తో గడపాలంటే తమను సంప్రదించండి అంటూ లింక్ కనిపించింది. దాన్ని క్లిక్ చేసిన పారిశ్రామికవేత్త కుమారుడు… సైట్ నిర్వాహకులు చెప్పినట్టు తొలుత 50 వేలు బ్యాంకు అకౌంట్‌లోకి వేశాడు. ఆ తర్వాత కూడా వివిధ కారణాలు చెబుతూ మొత్తం 10లక్షలు తీసుకున్నారు. అయినా సరే తన కలల హీరోయిన్‌ను కలిసే అవకాశం రాకపోవడంతో సైట్ నిర్వాహకులను గట్టిగా నిలదీశాడు. దాంతో అవతలి వ్యక్తి తిరిగి యువ పారిశ్రామికవేత్తను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
అప్పటి వరకు తమతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డును మొత్తం తిరిగి పంపించి… డబ్బు ఇవ్వకపోతే ఈ సంభాషణ మొత్తం మీ ఇంట్లో వారికి పంపిస్తామని బెదిరించాడు. దాంతో భయపడి 60 లక్షలు వరకు విడతల వారీగా చెల్లించాడు. ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో తట్టుకోలేక ఊరు వదిలిపారిపోయాడు యువ పారిశ్రామికవేత్త.
దాంతో అతడి తండ్రి తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు అతడు కోల్‌కతాలో ఉన్నట్టు గుర్తించి తీసుకొచ్చి విచారించగా అసలు విషయం చెప్పేశాడు. డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతా ఆధారంగా మణికంఠన్ అనే వ్యక్తిని తొలుత పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అతడు ఇదంతా చేసింది తమిళ నిర్మాత శరవణ కుమార్ అని పోలీసులకు వెల్లడించాడు. దాంతో నిర్మాత శరవణ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.