వరద ప్రాంతాల్లో.... కారుణ్య మూర్తులు
గుజరాత్‌లోని చాలా ఊళ్లను ఇబ్బంది పెడుతున్నట్లుగానే వడోదర పట్టణాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ పోలీస్ ప్రదర్శించిన కారుణ్యం, సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్ ఎడిషనల్ డీజీపీ షంషేర్ సింగ్ షేర్ చేసిన ఒక వీడియోలో సుమారు నాలుగు అడుగుల నీటిలో తల మీద ఒక టబ్‌తో వస్తున్న ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ టబ్‌లో చిన్న బేబి ఉంది. ఈ […]
గుజరాత్‌లోని చాలా ఊళ్లను ఇబ్బంది పెడుతున్నట్లుగానే వడోదర పట్టణాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ పోలీస్ ప్రదర్శించిన కారుణ్యం, సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుజరాత్ ఎడిషనల్ డీజీపీ షంషేర్ సింగ్ షేర్ చేసిన ఒక వీడియోలో సుమారు నాలుగు అడుగుల నీటిలో తల మీద ఒక టబ్‌తో వస్తున్న ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ టబ్‌లో చిన్న బేబి ఉంది. ఈ బేబి వయసు కేవలం 45 రోజులు మాత్రమేనట. మెడలోతు నీళ్లలో శిశువును, కుటుంబాన్ని రక్షించిన ఈ పోలీస్ పేరు గోవింద్ చావ్డా. అతడి మానవత్వానికి గర్విస్తున్నట్లు షంషేర్ సింగ్ ట్వీట్ చేశారు.
దేశంలో చాలా చోట్ల వర్షపాతం పుంజుకోవడంతో వ్యవసాయపనులు కూడా ఊపందుకున్నాయి. అయితే కొన్ని చోట్ల అతివృష్టి వల్ల వరదలు వెల్లువెత్తాయి. అస్సాం, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో వర్షం బీభత్సాన్నిసృష్టిస్తున్నది. వరదల్లో చిక్కున్నవారిని రక్షించడానికి సైన్యం, పోలీసులు, అనేక ఎన్‌జీవోలు రేయింబవళ్లు కష్టపడుతున్నాయి.
మహారాష్ట్రలో వరదనీరు చుట్టు ముట్టడంతో ఆగిపోయిన రైలు నుంచి 1050 మందిని హెలికాప్టర్లు, లైఫ్‌బోట్ల సాయంతో కాపాడటం తెలిసిందే. అస్సాంలో వరద నీటిలో చిక్కకున్న మనుషులను, వన్యప్రాణులను రక్షించడానికి ఎంతో కష్టపడ్డారు.
బీహార్‌లో ఓ ఆవుదూడను వీపుమీద ఎక్కించుకుని రక్షిస్తున్న మనిషి ఫొటో ఎంతో కారుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. మనుషుల్లో ఉండే దయాదాక్షిణ్యాలు, ధైర్యసాహసాలు బయటపడటానికి వరదలు వంటి క్లిష్ట పరిస్థితులు క్షేత్రాలుగా మారుతున్నాయి. ఈ వరదల నుంచే గొప్ప కారుణ్యమూర్తలు, సాహసవీరులు మనకు దర్శనమిస్తున్నారు.