కేక్ కోయడానికి కత్తిలేదని గన్‌తో...
ఉత్తరప్రదేశ్‌లో తుపాకులతో బర్త్ డే కేక్ కోయడం ఒక ట్రెండ్‌గా మారినట్లుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సంఘటనను మరువకుండానే మరోటి అక్కడ చోటుచేకోవడం ఆందోళన కలిగిస్తున్నది. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో ఓ కుర్రోడు గన్‌తో పుట్టిన రోజు కేక్‌ని షూట్ చేస్తూ కనిపించాడు. స్నేహితులతో కలిసి ఓ నడిరోడ్డుపై చేసిన ఈ ఘనకార్యాన్ని చూసి అతడు ఈ పని ఎందుకు చేస్తున్నాడా అని ఆరా తీస్తే… వచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించిందట. […]
ఉత్తరప్రదేశ్‌లో తుపాకులతో బర్త్ డే కేక్ కోయడం ఒక ట్రెండ్‌గా మారినట్లుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సంఘటనను మరువకుండానే మరోటి అక్కడ చోటుచేకోవడం ఆందోళన కలిగిస్తున్నది.
సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో ఓ కుర్రోడు గన్‌తో పుట్టిన రోజు కేక్‌ని షూట్ చేస్తూ కనిపించాడు. స్నేహితులతో కలిసి ఓ నడిరోడ్డుపై చేసిన ఈ ఘనకార్యాన్ని చూసి అతడు ఈ పని ఎందుకు చేస్తున్నాడా అని ఆరా తీస్తే… వచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించిందట. అతగాడికి కేక్ కోయటానికి కత్తి దొరకలేదట. జేబులో ఎటూ గన్ ఉంది కదా అని దానితోనే పనికానిచ్చేశాడట.
భాగ్‌పట్ జిల్లాలోని సరూర్పూర్ గ్రామంలో ఈ బర్త్‌డే పార్టీ బుధవారం నాడు జరిగిందని సమాచారం. బుల్లెట్ తగిలి కేక్ చిందరవందర అయిన వెంటనే అతడి స్నేహితులు హేపీ బర్తడే టూయూ అంటూ పాట అందుకున్నారట.
భాగల్‌పట్ సర్కిల్ ఆఫీసర్ ఓపీ సింగ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ గన్ పేల్చినవానిపై చర్యలు తీసుకుంటామని, అతడు చట్టవిరుద్ధంగా లైసెన్స్ లేని గన్‌ని వాడుతున్నాడని…. ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నదనీ చెప్పారు.
జనవరి మాసంలో ఇటువంటి బర్త్ డే పార్టీ ఒకటి జరిగింది. అది కూడా జనంలో భయాందోళనలకు దారితీసింది. ఈ పార్టీనంతా వీడియో తీసి టిక్ టాక్‌లో పెట్టారు. దీన్ని చూసి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ఇప్పటికే గన్ కల్చర్ ఉత్తరప్రదేశ్, బీహార్ లలో రాజ్యమేలుతున్నది. ఇండియాలో తుపాకి కాల్పుల ద్వారా జరిగే ప్రతి మూడు హత్యల్లో రెండు ఈ రెండు రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని ఒక నివేదిక తెలుపుతోంది. గన్ కల్చర్ హింసలో ఉత్తరప్రదేశ్‌ది 40 శాతం ఉందని మరో నివేదిక తెలియజేస్తున్నది.