Telugu Global
NEWS

మూడు ఎమ్మెల్సీలు వైసీపీకే...

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆగస్ట్ ఏడున నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈనెల 26న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఈ మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ ప్రకటించింది. ఏపీలో కరణం బలరామ కృష్ణమూర్తి, ఆళ్ల నాని, వీరభద్రస్వామి ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఆ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు సీట్లు […]

మూడు ఎమ్మెల్సీలు వైసీపీకే...
X

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆగస్ట్ ఏడున నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈనెల 26న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఈ మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ ప్రకటించింది.

ఏపీలో కరణం బలరామ కృష్ణమూర్తి, ఆళ్ల నాని, వీరభద్రస్వామి ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఆ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు సీట్లు కోటా… ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించినవే.

ప్రస్తుతం సభలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున మూడు స్థానాలు కూడా వైసీపీకే దక్కుతాయి. ఈ మూడు స్థానాల్లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు ఒక ఎమ్మెల్సీ ఖాయం. మిగిలిన రెండు స్థానాల్లో హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

రేసులో మర్రి రాజశేఖర్, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, రాజంపేట టికెట్‌ను మేడా మల్లికార్జున రెడ్డి కోసం వదులుకున్న అమర్‌నాథ్‌ రెడ్డిలు కూడా ఉన్నారు. అయితే విడతల వారీగా వీరికి ఎమ్మెల్సీలుగా వైసీపీ అవకాశం కల్పించే చాన్స్ ఉంది.

First Published:  2 Aug 2019 4:48 AM IST
Next Story