స్టీఫెన్ రవీంద్రకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ కేడర్‌కు చెందిన హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఏపీ కేడర్‌కు రావడం ఖాయమైంది. అంతర్ రాష్ట్ర బదిలీకి కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి ఏపీకి రప్పించేందుకు జగన్ ప్రయత్నించారు. కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో కేంద్ర హోంశాఖకు ఫైల్ వెళ్లింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫైల్ క్లియరెన్స్ ఆలస్యం అయింది. ఎట్టకేలకు కేంద్రం రవీంద్ర బదిలీకి ఆమోదముద్ర […]

తెలంగాణ కేడర్‌కు చెందిన హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఏపీ కేడర్‌కు రావడం ఖాయమైంది. అంతర్ రాష్ట్ర బదిలీకి కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి ఏపీకి రప్పించేందుకు జగన్ ప్రయత్నించారు. కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో కేంద్ర హోంశాఖకు ఫైల్ వెళ్లింది.
అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫైల్ క్లియరెన్స్ ఆలస్యం అయింది. ఎట్టకేలకు కేంద్రం రవీంద్ర బదిలీకి ఆమోదముద్ర వేసింది. స్టీఫెన్ రవీంద్రతో పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మీ కూడా ఏపీకి రాబోతున్నారు. ఆమె ఫైల్‌ను కూడా కేంద్రం క్లియర్ చేసినట్టు తెలుస్తోంది.
స్టీఫెన్ రవీంద్ర వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. గతంతో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ సెక్యూరిటీ అధికారిగా కూడా విధులు నిర్వర్తించారు.