కాపర్ డ్యాం ఎఫెక్ట్... గ్రామాలను చుట్టుముట్టిన వరద
గోదావరి వరద ఉధృతి కారణంగా పోలవరం ముంపు గ్రామాలను నీరు చుట్టుముట్టింది. దాంతో పలు గ్రామాల ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయకముందే గ్రామాలను నీరు చుట్టుముట్టింది. పోలవరం వద్ద నిర్మిస్తున్న కాపర్ డ్యాం వల్లే నీరు గ్రామాల్లోకి చేరినట్టు భావిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి ఉధృతి కారణంగా దాదాపు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణంగా భద్రాచలం వద్ద 42 అడుగుల వరద వస్తే మొదటి […]
గోదావరి వరద ఉధృతి కారణంగా పోలవరం ముంపు గ్రామాలను నీరు చుట్టుముట్టింది. దాంతో పలు గ్రామాల ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయకముందే గ్రామాలను నీరు చుట్టుముట్టింది. పోలవరం వద్ద నిర్మిస్తున్న కాపర్ డ్యాం వల్లే నీరు గ్రామాల్లోకి చేరినట్టు భావిస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి ఉధృతి కారణంగా దాదాపు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణంగా భద్రాచలం వద్ద 42 అడుగుల వరద వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ సమయంలో దిగువ దేవిపట్నం మండలంలోని కొన్ని గ్రామాలను మాత్రమే నీరు చుట్టుముట్టేది.
కానీ భద్రాచలం వద్ద 23 అడుగుల ప్రవాహం ఉన్నప్పటికీ కాపర్ డ్యాం కారణంగా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోకి నీరు వచ్చి చేరుతోంది.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రముఖ గండిపోశమ్మ అమ్మవారి ఆలయంలోకి గోదావరి వరద వచ్చింది. దాంతో ప్రజలను తరలించేందుకు అధికారులు లాంచీలను ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరోవైపు వరద ఉధృతి నుంచి ఎగువ కాపర్ డ్యాంను రక్షించేందుకు నీటిని పోలవరం స్విల్ వే మీదుగా మళ్లిస్తున్నారు. వరద తీవ్రత అధికంగా ఉండడంతో కాపర్ డ్యాం దెబ్బతినకుండా ఉండేందుకు, దానిపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.