నవయుగపై వేటు వేసిన జగన్ సర్కార్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రివర్స్ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టులను పరిశీలించిన నిపుణుల బృందం అక్రమాలు జరిగినట్టు తేల్చింది. ఈ నేపథ్యంలోనే నవయుగ కంపెనీని పోలవరం నిర్మాణం నుంచి తప్పించేందుకు సిద్ధమైంది. పనుల నుంచి తప్పుకోవాల్సిందిగా ఇరిగేషన్ శాఖ నుంచి నవయుగకు నోటీసులు జారీ అయ్యాయి. పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నుంచి కూడా తప్పుకోవాల్సిందిగా నవయుగను ఆదేశించింది. నిపుణుల కమిటీ ఆధారంగానే ప్రీక్లోజ్ నోటీసులు జారీ చేశారు. […]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రివర్స్ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టులను పరిశీలించిన నిపుణుల బృందం అక్రమాలు జరిగినట్టు తేల్చింది.
ఈ నేపథ్యంలోనే నవయుగ కంపెనీని పోలవరం నిర్మాణం నుంచి తప్పించేందుకు సిద్ధమైంది. పనుల నుంచి తప్పుకోవాల్సిందిగా ఇరిగేషన్ శాఖ నుంచి నవయుగకు నోటీసులు జారీ అయ్యాయి.
పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నుంచి కూడా తప్పుకోవాల్సిందిగా నవయుగను ఆదేశించింది. నిపుణుల కమిటీ ఆధారంగానే ప్రీక్లోజ్ నోటీసులు జారీ చేశారు.
60సీ ప్రకారం 2018 ఫిబ్రవరిలో హెడ్‌వర్క్స్ పనులను నవయుగకు అప్పగించింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఈ పని విలువ మూడు వేల కోట్లుగా ఉంది. 3వేల 220 కోట్ల విలువైన జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను కూడా నవయుగ గతంలో దక్కించుకుంది. ఇప్పుడు వీటి నుంచి తప్పుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.