ప్రారంభానికి సిద్ధమైన "మేఘా" థర్మల్ విద్యుత్ ప్లాంట్
జల, వాయు, సౌర విద్యుత్ రంగాలతో పాటు విద్యుత్ ట్రాన్స్‌మిషన్ రంగంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) తాజాగా రెండు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఇంటిగ్రేటెడ్ కంపెనీగా ఎదిగింది. తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో 525 మెగావాట్లు, నాగాయ్‌లో150 మెగావాట్ల సామర్థ్యాలు గల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మేఘా నిర్మించింది. నాగాయ్ థర్మల్ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను […]
జల, వాయు, సౌర విద్యుత్ రంగాలతో పాటు విద్యుత్ ట్రాన్స్‌మిషన్ రంగంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను పూర్తి చేసిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) తాజాగా రెండు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఇంటిగ్రేటెడ్ కంపెనీగా ఎదిగింది.
తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో 525 మెగావాట్లు, నాగాయ్‌లో150 మెగావాట్ల సామర్థ్యాలు గల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మేఘా నిర్మించింది. నాగాయ్ థర్మల్ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈప్లాంట్‌ను ఈ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
విద్యుత్ వెలుగులకు సర్వం సిద్ధం
తమిళనాడులో విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు చేపట్టిన నాగాయ్ థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యుత్ గ్రిడ్‌కు మేఘా అనుసంధానం చేసింది. ఈపీసీ పద్ధతిలో కెవికే ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఈ ప్లాంట్‌ను పూర్తి చేసింది.
తమిళనాడు నాగపట్నం నుంచి 15 కిలో మీటర్ల దూరంలో 230 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్లాంటుకు రైలు, రోడ్డు, విమాన మార్గాలతో పాటు సముద్ర రవాణా మార్గాలు కూడా ఉండడం విశేషం. దీంతో ప్లాంట్‌కు అవసరమైన బొగ్గులో 30 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం చాలా సులువు.
ఈ ప్లాంట్‌లో 125 మీటర్ల ఎత్తైన చిమ్ని, 530టీపీహెచ్ సామర్థ్యం గల బాయిలర్‌లను మేఘా ఏర్పాటు చేసింది. బిహెచ్‌ఈఎల్ రూపొందించిన 150 మెగావాట్ల టర్బైన్ జనరేటర్‌ను మేఘా ఈ ప్లాంటులో ఏర్పాటు చేసింది. అలాగే ఎయిర్‌కూల్డ్ కండెన్సర్‌ను కూడా ఏర్పాటు చేసింది.
జూలై 10 నాటికే థర్మల్ ప్లాంట్ సిద్ధమైంది
ఈ ప్లాంటు నిర్మాణానికి అవసరమైన 3700 టన్నుల స్టీల్‌ను మేఘా ఉత్పత్తి యూనిట్ నుంచే సరఫరా చేసింది. ఈ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ సరఫరా కోసం 24.6 కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్ లైన్‌ను తిరువూరులోని 230కేవీ సబ్‌స్టేషన్ వరకు వేశారు. వారం రోజులకు సరిపడా బొగ్గు నిల్వకు 114టీపీహెచ్ సామర్ధ్యం కలిగిన స్టోరేజి సదుపాయాన్ని కూడా మేఘా నిర్మించింది. జూలై 10 నాటికే థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులన్నింటని పూర్తి చేసి కమిషనింగ్‌ను పూర్తి చేసింది. ఇప్పటికే 130 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. లాంఛనంగా ప్రారంభం మాత్రమే మిగిలి ఉంది.
525 మెగావాట్ల ట్యుటికోరిన్ థర్మల్
ఎన్‌ఈపీసీ కోసం ఈపీసీ పద్దతిలో నిర్మిస్తున్న 525 మెగావాట్ల ట్యుటికోరిన్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్4 ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనిని తమిళనాడు లోని ట్యుటికోరిన్ జిల్లాలో నెలకొల్పారు. మేఘా ఫైనాన్షియల్, టెక్నికల్ బిడ్లలో అర్హత పొంది ఈ కాంట్రాక్టును సాధించింది. విఏ చిదంబరం పోర్టుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నుంచి వెలువడే బూడిదను వేయడానికి వడక్కుకరిసెరి గ్రామంలో 100 హెక్డార్ల స్థలంలో యాష్ పాండ్‌ను కూడా మేఘా నిర్మించింది.
ఈ ప్లాంట్‌లో 1700 టీపీహెచ్ సామర్ధ్యంగల బాయిలర్‌ను ఏర్పాటు చేసింది. బీహెచ్‌ఈఎల్ తయారు చేసిన 555 మెగావాట్ల టర్బైన్ జనరేటర్లను కూడా ఇప్పటికే అమర్చిచింది. 500టీపీహెచ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ సముద్ర జలాలను తీసుకునేందుకు 6700 క్యుమెక్కుల సామర్ధ్యం గల ఇంటేక్, గంటకు 66000 క్యూమెక్స్ సామర్థ్యం కలిగిన కూలింగ్ వాటర్ సిస్టమ్, 275 మీటర్ల ఎత్తుగల చిమ్మిని మేఘా ఇప్పటికే నిర్మించింది.
ఈ థర్మల్ పవర్ ప్లాంట్‌కు కావాల్సిన స్టీల్‌ను మేఘా స్వయంగా సరఫరా చేసింది. అలాగే, 10 కిలో మీటర్ల సీడబ్ల్యూ పైప్ లైన్‌ను కూడా సమకూర్చింది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సరఫరా చేయడానికి 48 కిలోమీటర్ల 400కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ ను కూడా నెలకొల్పడానికి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ట్రాజెన్కో) మేఘా కు అప్పగించింది. థర్మల్ ప్లాంట్ నుంచి ఒట్టిపీడరమ్ సబ్‌స్టేషన్ వరకు ఈ ట్రాన్స్‌మిషన్ లైన్ వేశారు.
విద్యుదుత్పత్తిలో అందెవేసిన చేయి
జల, వాయు, సౌర విద్యుత్ రంగంలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను నిర్మించి నిర్వహిస్తున్నది మేఘా. మొత్తం 112 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చింది. వడోదర బ్రాంచ్ కెనాల్ పై 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ కోసం ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్నమైనదిగాను, సృజనాత్మక ప్రాజెక్టుల జాబితాలో చోటు చేసుకుంది.
మహారాష్ట్ర జెన్‌కో కోసం చంద్రాపూర్‌లో 2 మెగావాట్లు, సాక్రి వద్ద 50 మెగా వాట్ల సౌర విద్యుత్ కేంద్రాలను మేఘా నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నాగలాపురం వద్ద 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని బీఓఓటీ ప్రాతిపదికన పూర్తి చేసింది.
ఇక జల విద్యుత్ రంగంలో హిమాచల్ ప్రదేశ్‌లోని లాంబడ్గ్లో వద్ద 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర బ్రాంచ్ కెనాల్ మీద 45 మెగావాట్ల సామర్థ్యంలతో మూడు జలవిద్యుత్ కేంద్రాలను మేఘా నెలకొల్పింది. ఇందులో రెండు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయి.