Telugu Global
NEWS

రెండు నాలుకలా... కన్నా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాపు రిజర్వేషన్లపై మాట మార్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకలా… ఇప్పుడు మరోలా మాట్లాడి ఆశ్చర్యపరిచారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం మోడీ సర్కార్‌ పది శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చింది. తీరా ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులను ఆకట్టుకునేందుకు అగ్రవర్ణాలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తున్నట్టు ప్రకటించారు. అలా ఈబీసీ రిజర్వేషన్‌ విభజించి ఒక కులానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని […]

రెండు నాలుకలా... కన్నా?
X

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాపు రిజర్వేషన్లపై మాట మార్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకలా… ఇప్పుడు మరోలా మాట్లాడి ఆశ్చర్యపరిచారు.

దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం మోడీ సర్కార్‌ పది శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చింది. తీరా ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులను ఆకట్టుకునేందుకు అగ్రవర్ణాలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తున్నట్టు ప్రకటించారు.

అలా ఈబీసీ రిజర్వేషన్‌ విభజించి ఒక కులానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు ఎన్నికల సమయంలో అలా నమ్మించేశారు. ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టాడు. గతంలో ఇదే తరహాలో మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని… ఆ తర్వాత బీసీలకు, కాపులకు మధ్య చిచ్చుపెట్టారని… ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్‌లో ఐదు శాతం కాపులకు కేటాయిస్తున్నట్టు చెప్పడం ద్వారా ఓసీలకు, కాపులకు మధ్యచిచ్చుపెట్టారని ఆరోపించారు. అలా చేయడం సాధ్యం కాదని.. చంద్రబాబు అంటేనే మోసమని… చంద్రబాబును నమ్మిన వాళ్లను భగవంతుడు కూడా కాపాడలేరని ఈ ఏడాది జనవరి 22న కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పట్లో అలా మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ .. ఇప్పుడు మాత్రం ఏకంగా చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్లను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టడం సరికాదంటూ వాదిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఈబీసీ కోటాను రాష్ట్రాలు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చుకోవచ్చని వింత వాదన కూడా కన్నా వినిపించారు.

ఈబీసీ కోటాను విభజించి ఒక కులానికే ఐదు శాతం ఇవ్వడం సాధ్యం కాదని గతంలో బీజేపీ నేతలు చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఈబీసీ కోటాను విభజించడం సాధ్యం కాదు … అలా చెప్పడం కాపులను మోసం చేయడమేనని ఇటీవల ప్రకటించారు.

First Published:  1 Aug 2019 10:57 AM IST
Next Story