పవన్ తో మాజీ జేడీకి గ్యాప్.... బీజేపీ వైపు చూపు ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మినారాయణకు గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత లక్ష్మినారాయణ కనీసం జనసేన వైపు చూడడం లేదు. ఇంతవరకూ పవన్ కల్యాణ్ తో భేటీ కాలేదు. కనీసం కర్టెసీ కాల్ కింద కూడా సమావేశం కాలేదు. జనసేన సమావేశాలకు కూడా లక్ష్మినారాయణ వెళ్లడం లేదు. విజయవాడలో సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర రివ్యూ జరిగింది. కానీ మాజీ జేడీ మాత్రం హాజరుకాలేదు. టీడీపీలో టికెట్ రాకపోవడంతోనే జనసేన […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మినారాయణకు గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత లక్ష్మినారాయణ కనీసం జనసేన వైపు చూడడం లేదు. ఇంతవరకూ పవన్ కల్యాణ్ తో భేటీ కాలేదు. కనీసం కర్టెసీ కాల్ కింద కూడా సమావేశం కాలేదు.
జనసేన సమావేశాలకు కూడా లక్ష్మినారాయణ వెళ్లడం లేదు. విజయవాడలో సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర రివ్యూ జరిగింది. కానీ మాజీ జేడీ మాత్రం హాజరుకాలేదు. టీడీపీలో టికెట్ రాకపోవడంతోనే జనసేన నుంచి లక్ష్మినారాయణ పోటీ చేయాల్సి వచ్చింది. అందుకే ఆయన జనసేనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
జనసేనలో లక్ష్మినారాయణ ఎక్కువ కాలం ఉండే వీలు లేదని తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. పాత పరిచయాలతో ఆయన టీడీపీ లేదా బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందని విశాఖలో టాక్. అయితే ప్రస్తుత పరిస్తితుల్లో టీడీపీ కంటే బీజేపీ వైపు వెళ్లడమే బెటర్ అని కొందరు ఆయనకు సలహా ఇచ్చారట.
టీడీపీ అధినేత చంద్రబాబుతో లక్ష్మినారాయణకు మంచి సంబంధాలు ఉన్నాయనేది ఆ పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట. పార్టీమారే ముందు చంద్రబాబును కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అప్పట్లో బాబు సలహా మేరకే లక్ష్మినారాయణ జనసేనలో చేరారు. ఇప్పుడు ఆయన సలహా ప్రకారమే బీజేపీలో చేరే అవకాశం ఉందని తమ్ముళ్ల వాదన. మరికొద్దిరోజుల్లోనే లక్ష్మినారాయణ పయనం ఎటు అనే విషయం మాత్రం తేలబోతుంది.