ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ ఫోకస్...
కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో… కశ్మీర్ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మంగళవారం ఫరూక్ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అలా చేసిన మరుసటి రోజే ఈడీ ఆయన్ను విచారించింది. చత్తీస్‌గడ్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిపించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మనీలాండరింగ్ కేసును నమోదు చేశారు. సీబీఐ చార్జిషీట్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసింది ఈడీ. […]
కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఆర్టికల్ 35ఏ ను రద్దు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో… కశ్మీర్ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మంగళవారం ఫరూక్ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అలా చేసిన మరుసటి రోజే ఈడీ ఆయన్ను విచారించింది.
చత్తీస్‌గడ్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిపించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మనీలాండరింగ్ కేసును నమోదు చేశారు. సీబీఐ చార్జిషీట్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసింది ఈడీ.
జమ్ము- కశ్మీర్‌లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు బీసీసీఐ ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు 42 కోట్లు ఇచ్చింది. ఈ సొమ్మును ఫరూక్ అబ్దుల్లా, మరో ముగ్గురు కలిసి దుర్వినియోగం చేశారన్నది ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా, మరో ముగ్గురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగింది.
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ను ఈడీ విచారించడాన్ని ఆ పార్టీ ప్రత్యర్థి అయిన పిపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఖండించారు. ఆర్టికల్ 35ఏ రద్దుకు వ్యతిరేకంగా కశ్మీర్ పార్టీలన్ని ఏకతాటిపైకి వస్తుండడంతో కేంద్రం బెదిరింపు చర్యలకు దిగుతోందని…. అందులో భాగమే ఫరూక్‌ను ఈడీ విచారించడం అని ఆమె ఆరోపించారు.