బర్మింగ్ హామ్ వేదికగా నేడే యాషెస్ తొలిసమరం
ఇంగ్లండ్ గడ్డపై 2001 తర్వాత యాషెస్ విజయానికి కంగారూల తహతహ ఇంగ్లండ్ తుదిజట్టులో చోటు లేని ఆర్చర్, సామ్ కరెన్, స్టోన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరో ఆసక్తికరమైన యాషెస్ సిరీస్ సమరానికి ఇంగ్లండ్ విజయాల అడ్డా బర్మింగ్ హామ్ వేదికగా నేడు తెరలేవనుంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా తొలిసారిగా 5 మ్యాచ్ ల యాషెస్ సిరీస్ ను నిర్వహిస్తున్నారు. హాట్ ఫేవరెట్ గా ఇంగ్లండ్.. యాషెస్ సిరీస్ లో ఆస్ట్ర్రేలియా ప్రస్తుత చాంపియన్ గా […]
- ఇంగ్లండ్ గడ్డపై 2001 తర్వాత యాషెస్ విజయానికి కంగారూల తహతహ
- ఇంగ్లండ్ తుదిజట్టులో చోటు లేని ఆర్చర్, సామ్ కరెన్, స్టోన్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరో ఆసక్తికరమైన యాషెస్ సిరీస్ సమరానికి ఇంగ్లండ్ విజయాల అడ్డా బర్మింగ్ హామ్ వేదికగా నేడు తెరలేవనుంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా తొలిసారిగా 5 మ్యాచ్ ల యాషెస్ సిరీస్ ను నిర్వహిస్తున్నారు.
హాట్ ఫేవరెట్ గా ఇంగ్లండ్..
యాషెస్ సిరీస్ లో ఆస్ట్ర్రేలియా ప్రస్తుత చాంపియన్ గా ఉన్నా…ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రమే హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. జో రూట్ నాయకత్వంలోని 12 మంది సభ్యుల తుదిజట్టులో యువ ఆల్ రౌండర్ సామ్ కరెన్ , ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, స్టోన్ చోటు దక్కించుకోలేక పోయారు.
సీనియర్ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ తురుపుముక్క జిమ్మీ యాండర్సన్ గాయం నుంచి కోలుకొని సమరానికి సిద్ధమయ్యాడు.
హేమాహేమీలతో కంగారూ టీమ్…
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టిమ్ పెయిన్ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియా జట్టులోని 17 మంది సభ్యుల్లో… బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ బాన్ క్రాఫ్ట్ ఉన్నారు.
కంగారూ జట్టులో చోటు సంపాదించిన ఇతర ఆటగాళ్లలో పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, మార్కుస్ హారిస్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిడ్ హెడ్, మార్నుస్ సాబ్నుచేజ్, నేథన్ లయన్, మిషెల్ మార్ష్, మైకేల్ నెసెర్, జేమ్స్ పాటిన్ సన్, పీటర్ సిడిల్, మాథ్యూ వేడ్ సైతం ఉన్నారు.
2001 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ సిరీస్ విజయం లేని ఆస్ట్ర్రేలియా ఆ లోటును ప్రస్తుత సిరీస్ ద్వారా పూడ్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.
ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లు…
యాషెస్ సిరీస్ చరిత్రలోనే తొలిసారిగా రెండుజట్ల ఆటగాళ్లు ధరించే జెర్సీలపై నంబర్లతో పాటు…వారి పేర్లను సైతం ముద్రించబోతున్నారు. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో తలపడే మొత్తం తొమ్మిది జట్ల జెర్సీలనూ నంబర్లు, పేర్లతో ముస్తాబు చేయనున్నారు.
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 16 వరకూ జరిగే ఐదుమ్యాచ్ ల యాషెస్ సిరీస్ లోని తొలిటెస్టును ….బర్మింగ్ హామ్ వేదికగా ఆగస్టు 1-5 వరకూ నిర్వహిస్తారు.
రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 14 నుంచి 18 వరకూ క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరుగుతుంది.
ఇక…సిరీస్ లోని మూడుటెస్ట్ మ్యాచ్ ఆగస్టు 22 నుంచి 26 వరకూ హెడింగ్లేలోనూ, నాలుగో టెస్ట్
సెప్టెంబర్ 4 నుంచి 8 వరకూ ఓల్డ్ ట్రాఫర్డ్ లోనూ, ఆఖరి టెస్ట్ సెప్టెంబర్ 12నుంచి 16 వరకూ ఓవల్ లోనూ జరుగుతాయి.