ఢిల్లీ ప్రజలకు ఇకపై కరెంటు బిల్లులు లేవు... 200 యూనిట్లు ఉచితం
ఢిల్లీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఆప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఇకపై ఉచితంగా అందిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇది అగస్టు 1 (ఈ రోజే) నుంచి అమలులోనికి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఇకపై కరెంటు బిల్లు ఉండదని.. 201 నుంచి 400 యూనిట్ల వరకు వచ్చే బిల్లులో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని.. మిగిలిన 50 […]
ఢిల్లీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఆప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఇకపై ఉచితంగా అందిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇది అగస్టు 1 (ఈ రోజే) నుంచి అమలులోనికి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ఇకపై కరెంటు బిల్లు ఉండదని.. 201 నుంచి 400 యూనిట్ల వరకు వచ్చే బిల్లులో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని.. మిగిలిన 50 శాతం వినియోగదారుడు భరించాలని ఆయన చెప్పారు.
ఢిల్లీలో దాదాపు 33 శాతం మంది గత ఎండా కాలంలో 200 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగించారు. ఇక వర్షాకాలం, చలికాలంలో దాదాపు 70 శాతం మందికి 200 లోపే యూనిట్లు ఖర్చు అవుతాయి. దేశంలో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది.
దేశంలో రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్నవాళ్లు ఉచిత విద్యుత్ వాడుతున్నప్పుడు సామాన్యుడికి ఉచితంగా విద్యుత్ అందించడంలో తప్పు లేదని కేజ్రీవాల్ అన్నారు. ‘ఫ్రీ లైఫ్‌లైన్ ఎలక్ట్రిసిటీ’ స్కీం పేరిట ఈ విద్యుత్‌ను అందించనున్నారు.
మరోవైపు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ స్కీంపై ట్వీట్ చేశారు. మంచి విద్య, ఆరోగ్యం లాగే విద్యుత్ కూడా కనీస అవసరాల్లో ఒకటి.. అందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొదట్లో సగం ఇప్పుడు మొత్తం (పెహెలే హాఫ్ అబ్ మాఫ్) అంటూ హ్యాష్ టాగ్ ఇచ్చారు.
Historic day for Delhi!
CM @ArvindKejriwal declares Free Lifeline Electricity of 200 units to allEvery family deserves a life of dignity. Just like good education & healthcare, a basic quantum of electricity to run lights/fans at home is essential for that. #PehleHalfAbMaaf
— Manish Sisodia (@msisodia) August 1, 2019