Telugu Global
National

మత పిచ్చిగాడికి జొమాటో గట్టి కౌంటర్

మత పిచ్చి కొందరిలో ముదిరిపోతోంది. ఎంతగా అంటే వేరే మతం వాళ్లు ఫుడ్ డెలివరీ చేసినా సహించలేనంతగా. ఢిల్లీలో ఇలాంటి మతపిచ్చి ఉన్న వ్యక్తి ఉదంతం బయటపడింది. అతడిని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. నడిరోడ్డులో ఏ లారీనో గుద్దేసి పడిపోయి ఉంటే అప్పుడు ఎవరైనా రక్షించేందుకు ముందుకు వస్తే అప్పుడు కూడా మీ మతం ఏమిటి అని అడుగుతావా? అంటూ సదరు వ్యక్తిని దులిపేస్తున్నారు. దేశంలో మనుషుల మధ్య అంతరాలు పెరగడానికి ఇలాంటి మూర్ఖులే కారణమంటూ […]

మత పిచ్చిగాడికి జొమాటో గట్టి కౌంటర్
X

మత పిచ్చి కొందరిలో ముదిరిపోతోంది. ఎంతగా అంటే వేరే మతం వాళ్లు ఫుడ్ డెలివరీ చేసినా సహించలేనంతగా. ఢిల్లీలో ఇలాంటి మతపిచ్చి ఉన్న వ్యక్తి ఉదంతం బయటపడింది. అతడిని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.

నడిరోడ్డులో ఏ లారీనో గుద్దేసి పడిపోయి ఉంటే అప్పుడు ఎవరైనా రక్షించేందుకు ముందుకు వస్తే అప్పుడు కూడా మీ మతం ఏమిటి అని అడుగుతావా? అంటూ సదరు వ్యక్తిని దులిపేస్తున్నారు.

దేశంలో మనుషుల మధ్య అంతరాలు పెరగడానికి ఇలాంటి మూర్ఖులే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ మేటర్ ఏమిటంటే… ఢిల్లీకి చెందిన అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్‌ దాన్ని తీసుకుని వచ్చాడు. వచ్చిన డెలివరీ బాయ్‌ హిందువు కాదంటూ ఫుడ్ తీసుకునేందుకు అతడు అంగీకరించలేదు.

తనకు ఇతర మతస్తుల ద్వారా ఆహారం పంపించవద్దని జొమాటోతో వాదన పెట్టుకున్నాడు. అయితే అమిత్ శుక్లా విజ్ఞప్తిని జొమాటో తిరస్కరించింది. తాము వివక్షను ఆమోదించబోమని స్పష్టం చేసింది. మరో బాయ్‌ని పంపేందుకు నిరాకరించింది.

దాంతో అమిత్ శుక్లా ఫుడ్ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ అంశాన్ని జొమాటో ట్వీట్ చేసింది.

ఇంతగా మతపిచ్చితో వ్యవహరించిన అమిత్ శుక్లాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమిత్ శుక్లా పట్ల జొమాటో వ్యవహరించిన తీరును నెటిజన్లు సమర్ధిస్తున్నారు.

First Published:  31 July 2019 10:20 AM IST
Next Story