జగన్ పిలిచి ఏ పదవైనా ఇస్తే తీసుకుంటా... నేనుగా అడగను
ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు దర్శకుడు పోసాని కృష్ణమురళి. రెండు నెలల పాటు అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవమేనన్నారు. కానీ కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేశారన్నారు. వైసీపీకి చిత్రపరిశ్రమ నుంచి మొదట మద్దతు పలికింది రోజా, తాను అని చెప్పారు. వైసీపీ కోసం తాను చేయాల్సినంత చేశానని చెప్పారు. ఎన్నికలకు ముందే వైసీపీ తరపున కొందరు పెద్దలు తన ఇంటికి వచ్చి రాజ్యసభ కావాలా? ఎమ్మెల్సీ కావాలా? అని అడిగారన్నారు. కానీ […]
ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు దర్శకుడు పోసాని కృష్ణమురళి. రెండు నెలల పాటు అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవమేనన్నారు. కానీ కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేశారన్నారు. వైసీపీకి చిత్రపరిశ్రమ నుంచి మొదట మద్దతు పలికింది రోజా, తాను అని చెప్పారు. వైసీపీ కోసం తాను చేయాల్సినంత చేశానని చెప్పారు.
ఎన్నికలకు ముందే వైసీపీ తరపున కొందరు పెద్దలు తన ఇంటికి వచ్చి రాజ్యసభ కావాలా? ఎమ్మెల్సీ కావాలా? అని అడిగారన్నారు. కానీ తాను ఏ పదవి వద్దని… జగన్ ముఖ్యమంత్రి అయితే చాలు అని చెప్పి పంపించానన్నారు. జగన్ పిలిచి ఈ పదవి తీసుకుని ఈ పని చెయ్ అంటే మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా అప్పగిస్తే తాను చేస్తానన్నారు. ఇప్పటి వరకు చూసిన ముఖ్యమంత్రుల్లో జగన్ మోహన్ రెడ్డి అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నారన్నారు. పోలవరం లాంటి ప్రాజెక్టుల్లో కమిషన్లు తీసుకునేందుకు అవకాశం ఉన్నా సరే కాంట్రాక్టుల అప్పగింత కోసం న్యాయసమీక్ష కమిటీని నియమించడం గొప్ప నిర్ణయమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన జగన్ ఖజానా ఖాళీగా ఉన్నా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాడని అన్నారు.
జగన్ సీఎం కావడం చిత్రపరిశ్రమకు ఇష్టం లేదని పృద్వీ చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే నిర్మాత సురేష్‌బాబు … సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ అడిగారన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత చిత్రపెద్దలు ముఖ్యమంత్రిని కలుస్తారని పోసాని చెప్పారు. ఈ సమాచారం పృద్వీకి చేరి ఉండకపోవచ్చన్నారు.