కింగ్‌ని కాదు... కింగ్ మేకర్‌ని
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అనేక మంది అనుభవం ఉన్న వారు ఆయన వెంట నిలబడ్డారని.. కానీ తన వద్ద అలాంటి వారు ఎవరూ లేరన్నారు పవన్ కళ్యాణ్. తనకు జనబలం ఉందన్న విషయం తెలుసన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది తన వల్లేనని… కానీ జనసేనతో గొడవ పెట్టుకున్నందుకే ఈరోజు టీడీపీ ప్రభుత్వం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి జనసేనకు ఉందో లేదో తెలియదు గానీ… ఒక పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి మాత్రం […]
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అనేక మంది అనుభవం ఉన్న వారు ఆయన వెంట నిలబడ్డారని.. కానీ తన వద్ద అలాంటి వారు ఎవరూ లేరన్నారు పవన్ కళ్యాణ్. తనకు జనబలం ఉందన్న విషయం తెలుసన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది తన వల్లేనని… కానీ జనసేనతో గొడవ పెట్టుకున్నందుకే ఈరోజు టీడీపీ ప్రభుత్వం లేకుండా పోయిందన్నారు.
ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి జనసేనకు ఉందో లేదో తెలియదు గానీ… ఒక పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి మాత్రం జనసేనకు ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. దేశంలో తాము ద్వితీయ శ్రేణి పౌరుడిలా బతకాలా? అని గతంలో మోడీనే తాను ప్రశ్నించానని చెప్పారు.
పార్టీలోని నాయకులు పనిచేయకుండా అంతా తన మీదకు ఎక్కితే ఎంత మందిని తాను మోయగలను అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఊరురూ తిరగండి అని తనకు సలహాలు ఇస్తున్నారే గానీ… నాయకులు అలా ఊరురూ ఎందుకు తిరగడం లేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
ఇప్పుడు ఊరూరా మోడీ, చంద్రబాబు, లోకేష్ తిరుగుతున్నారా? అని ప్రశ్నించారు. తాను కూడా రోడ్ల మీద తిరిగేందుకు సిద్ధమని.. కానీ తనను అభిమానులు రోడ్లు మీద తిరగనిస్తారా? అని ప్రశ్నించారు. తాను రోడ్డు మీదకు వస్తే అందరూ వచ్చి మీద పడుతారన్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా నడిచే పరిస్థితులు కల్పిస్తే ఈ రాష్ట్రంలో తన కంటే ఎక్కువగా తిరిగే వారు ఎవరూ ఉండరన్నారు పవన్ కల్యాణ్.