కాశ్మీర్ లోయలో నేటినుంచే ధోనీ పహారా
సైనికుడుగా విధుల్లో రెండుమాసాలపాటు ధోనీ భారత సైన్యంలో గౌరవ లెఫ్ట్ నెంట్ కర్నల్ గా ధోనీ భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనీ..తన 37 సంవత్సరాల జీవితంలో ఓ గురుతర బాధ్యతకు సిద్ధమయ్యాడు. ఓ క్రికెటర్ గా గత 15 సంవత్సరాలుగా సేవలు అందించిన ధోనీ…సుక్షితుడైన ఓ సైనికుడుగా కూడా సేవచేయటానికి ఉరకలేస్తున్నాడు. 2015 లోనే భారత ప్రాదేశిక దళాలకు చెందిన విక్టర్ ఫోర్స్ లో గౌరవ లెఫ్ట్ నెంట్ కర్నల్ హోదా పొందిన […]
- సైనికుడుగా విధుల్లో రెండుమాసాలపాటు ధోనీ
- భారత సైన్యంలో గౌరవ లెఫ్ట్ నెంట్ కర్నల్ గా ధోనీ
భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనీ..తన 37 సంవత్సరాల జీవితంలో ఓ గురుతర బాధ్యతకు సిద్ధమయ్యాడు. ఓ క్రికెటర్ గా గత 15 సంవత్సరాలుగా సేవలు అందించిన ధోనీ…సుక్షితుడైన ఓ సైనికుడుగా కూడా సేవచేయటానికి ఉరకలేస్తున్నాడు.
2015 లోనే భారత ప్రాదేశిక దళాలకు చెందిన విక్టర్ ఫోర్స్ లో గౌరవ లెఫ్ట్ నెంట్ కర్నల్ హోదా పొందిన ధోనీ..ఆగ్రాలోని వైమానికదళ పారాట్రూప్ శిక్షణ సంస్థలో ఐదుసార్లు నింగిలోని విమానం నుంచి నేలపైకి పారాజంప్ లు చేయడం ద్వారా సుక్షితుడైన పారాట్రూపర్ గా సత్తా చాటుకొన్నాడు.
ఆగస్టు 15 వరకూ గస్తీ విధులు…
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత..క్రికెట్ నుంచి తాత్కాలికంగా విరామం తీసుకొన్న ధోనీ… రెండు మాసాలపాటు.. సైనిక విధుల్లో పాల్గొనటానికి భారత సైనిక దళాల నుంచి అనుమతి సంపాదించాడు.
అంతేకాదు.. కాశ్మీర్ లోయలో విక్టర్ ఫోర్స్ దళం సభ్యుడిగా.. పహారా, గస్తీ విధులు నిర్వహించడం కోసం 15 రోజుల ప్రత్యేక శిక్షణ సైతం తీసుకొన్నాడు.
జులై 31 నుంచి ఆగస్టు 15 వరకూ కాశ్మీర్ లోయలో ధోనీ తన దళం సభ్యులతో కలసి తనకు కేటాయించిన బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే సైనికుడుగా రెండుమాసాలు సేవ చేసిన ఒకేఒక్క, ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించబోతున్నాడు.