మరో భారీ యాగానికి కేసీఆర్ సిద్ధం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో భారీ యాగానికి సిద్ధమవుతున్నారు. త్వరలో యాదాద్రి వేదికగా మహా సుదర్శన యాగం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకునేందుకు త్రిదండి చినజీయర్ స్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని చినజీయర్ ఆశ్రమానికి వచ్చిన కేసీఆర్… పలు అంశాలపై ఆయనతో చర్చించారు. వంద ఎకరాల యజ్ఞ వాటికలో 1048 యజ్ఞ కుండాలతో మహా సుదర్శన యాగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు 3వేల మంది రుత్వికులను ఆహ్వానిస్తున్నారు. కేవలం […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో భారీ యాగానికి సిద్ధమవుతున్నారు. త్వరలో యాదాద్రి వేదికగా మహా సుదర్శన యాగం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకునేందుకు త్రిదండి చినజీయర్ స్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు.
శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని చినజీయర్ ఆశ్రమానికి వచ్చిన కేసీఆర్… పలు అంశాలపై ఆయనతో చర్చించారు. వంద ఎకరాల యజ్ఞ వాటికలో 1048 యజ్ఞ కుండాలతో మహా సుదర్శన యాగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు 3వేల మంది రుత్వికులను ఆహ్వానిస్తున్నారు.
కేవలం భారతదేశంలోనివి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలతోపాటు బద్రీనాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి వంటి మహాక్షేత్రాల నుంచి మతాధిపతులను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను, మంత్రులను, అన్ని సంప్రదాయాలకు చెందిన మత గురువులను ఈ యాగానికి ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
చినజీయర్‌తో భేటీ అనంతరం కేసీఆర్ రామేశ్వర్‌రావుకు చెందిన ఫాంహౌజ్‌కు వెళ్లారు. అక్కడ రామేశ్వరరావుతో చాలాసేపు చర్చించారు.