Telugu Global
Cinema & Entertainment

కె.జి.యఫ్ హీరో తో.... పూరి 'జన గణ మన' ?

దర్శకుడు పూరి జగన్నాథ్  ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా పూరి మీడియాతో ఎక్కువగా ముచ్చటిస్తూ వస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఇతర సినిమా సంగతులు కూడా మీడియా కి చెప్తూ వస్తున్నాడు. మహేష్ బాబు తో తాను చేయాలనుకున్న ‘జన గణ మన’ గురించి పూరి చెప్పిన సంగతులు అందరికీ తెలిసిందే. దాని బట్టి చూస్తే ఇక ఆ సినిమా మహేష్ […]

కె.జి.యఫ్ హీరో తో.... పూరి జన గణ మన ?
X

దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా పూరి మీడియాతో ఎక్కువగా ముచ్చటిస్తూ వస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఇతర సినిమా సంగతులు కూడా మీడియా కి చెప్తూ వస్తున్నాడు.

మహేష్ బాబు తో తాను చేయాలనుకున్న ‘జన గణ మన’ గురించి పూరి చెప్పిన సంగతులు అందరికీ తెలిసిందే. దాని బట్టి చూస్తే ఇక ఆ సినిమా మహేష్ తో తీసే ప్రసక్తే లేదని స్పష్టం గా అర్ధం అవుతుంది.

ఇక అది పక్కన పెడితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ సినిమా ని ఇప్పుడు పూరి… కె.జి.యఫ్ హీరో యష్ తో చేయాలనే ఆలోచన తో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.

First Published:  31 July 2019 8:35 AM IST
Next Story