Telugu Global
National

నదిలో దూకేసిన సీఎం అల్లుడు... అసలు కారణం ఇదీ...

కర్నాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ్‌ మిస్సింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. అతడి కోసం 200 మంది పోలీసులు గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. కేఫ్ కాఫీ డేను స్థాపించింది సిద్ధార్థే. అదృశ్యానికి ముందు బెంగళూరు నుంచి సఖిలేష్‌పూర్‌కు సిద్ధార్థ్‌ కారులో బయలుదేరాడు. దారిలో హఠాత్తుగా కారును మంగళూరు వైపు మళ్లించాల్సిందిగా డ్రైవర్‌కు సూచించాడు. నేత్రావతి నది వద్దకు రాగానే కారు ఆపాల్సిందిగా సూచించాడు. అక్కడ నది కట్టపై […]

నదిలో దూకేసిన సీఎం అల్లుడు... అసలు కారణం ఇదీ...
X

కర్నాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ్‌ మిస్సింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. అతడి కోసం 200 మంది పోలీసులు గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. కేఫ్ కాఫీ డేను స్థాపించింది సిద్ధార్థే. అదృశ్యానికి ముందు బెంగళూరు నుంచి సఖిలేష్‌పూర్‌కు సిద్ధార్థ్‌ కారులో బయలుదేరాడు. దారిలో హఠాత్తుగా కారును మంగళూరు వైపు మళ్లించాల్సిందిగా డ్రైవర్‌కు సూచించాడు. నేత్రావతి నది వద్దకు రాగానే కారు ఆపాల్సిందిగా సూచించాడు.

అక్కడ నది కట్టపై అరగంట పాటు అటు ఇటు తిరిగిన సిద్ధార్థ్ ఆ తర్వాత కనిపించలేదు. దాంతో అతడు నదిలో దూకి ఉంటారని భావిస్తున్నారు. మిస్సింగ్‌కు ముందు కంపెనీ ఉద్యోగులకు సిద్ధార్థ్‌ లేఖ రాశాడు. తాను కంపెనీని లాభాల్లోకి తీసుకురాలేకపోయానని ఆవేదన చెందారు. తానో విఫలమైన పారిశ్రామికవేత్తనని చెప్పుకున్నాడు. చాలా కాలం పోరాటం చేసినా చివరకు ఓడిపోయానని లేఖలో వివరించారు.

తన పై ప్రైవేట్ ఈక్విటీ పార్టనర్ల ఒత్తిడి తీవ్రంగా ఉందని చెప్పాడు. ఆరు నెలల క్రితం తానో స్నేహితుడి వద్ద భారీగా అప్పు చేశానని… అప్పు చెల్లించడం కోసం షేర్లు అమ్మాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని వెల్లడించారు. 37ఏళ్ల తన కృషితో 30వేల మందికి ప్రత్యక్షంగా, 20వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించానని… ఇక పోరాడే ఓపిక తనకు లేదన్నాడు. ఆదాయపు పన్ను శాఖ గత డీజీ నుంచి కూడా వేధింపులు ఉన్నాయని చెప్పాడు. కొత్త యాజమాన్యం ఉద్యోగులకు బాసటగా ఉంటుందని తాను ఆశిస్తున్నానని లేఖలో వివరించారు. సిద్ధార్థ్‌ అదృశ్యం విషయం తెలియగానే పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎస్‌ఎం కృష్ణ నివాసానికి చేరుకుని ఆరా తీశారు.

First Published:  30 July 2019 6:42 AM IST
Next Story