ట్రిపుల్ తలాక్ బిల్లు... రాజ్యసభలో ఆమోదం
వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ రాజ్యసభలో ఆమోదం పొందింది. ఓటింగ్ స్లిప్పుల ద్వారా నిర్వహించిన ఎన్నికలో బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు రావడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బిల్లు పాస్ అయినట్లు ప్రకటించారు. అంతకు మునుపు రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లుపై విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించారు. కాని ఈ సవరణలన్నీ వీగిపోయాయి. ఓటింగ్‌కు వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు […]
వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ రాజ్యసభలో ఆమోదం పొందింది. ఓటింగ్ స్లిప్పుల ద్వారా నిర్వహించిన ఎన్నికలో బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు రావడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బిల్లు పాస్ అయినట్లు ప్రకటించారు.
అంతకు మునుపు రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లుపై విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించారు. కాని ఈ సవరణలన్నీ వీగిపోయాయి.
ఓటింగ్‌కు వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు దూరంగా ఉండగా.. బీఎస్పీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఓటింగ్ నిర్వహించడానికంటే ముందే ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలా వద్దా అనే అంశంపై ఓటింగ్ నిర్వహించారు. కాగా, సెలెక్ట్ కమిటీకి పంపాలనే ప్రతిపాదనలపై 84 మంది అనుకూలంగా, 100 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
దీంతో తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండానే సభలో చర్చించి ఓటింగ్ నిర్వహించారు. రాజ్యసభలో అధికారపక్షం కంటే విపక్షానికే అధిక మెజార్టీ ఉన్నా.. సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో తలాక్ బిల్లు పాసయ్యింది.
ఈ నెల 25న ట్రిపుల్ తాలాక్ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది.