Telugu Global
National

రాష్ట్రాల వారీగా పెద్ద పులుల సంఖ్య

దేశంలో పెద్దపులుల సంఖ్య అమాంతం పెరిగింది. 2006తో పోలిస్తే దేశంలో పులుల సంఖ్య రెట్టింపు అయింది. దేశంలో పులుల గణాంకాలకు సంబంధించిన నివేదికను మోడీ విడుదల చేశారు. 2006లో దేశంలో మొత్తం పులుల సంఖ్య 1411గా ఉంది. 2014కు అది 2226కు చేరింది. 2018 గణాంకాల ప్రకారం పులుల సంఖ్య ప్రస్తుతం 2,967గా ఉంది. పులులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌ తొలి స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, చత్తీస్‌గడ్, ఒడిషాలో మాత్రం పులుల సంఖ్య పడిపోయింది. […]

రాష్ట్రాల వారీగా పెద్ద పులుల సంఖ్య
X

దేశంలో పెద్దపులుల సంఖ్య అమాంతం పెరిగింది. 2006తో పోలిస్తే దేశంలో పులుల సంఖ్య రెట్టింపు అయింది. దేశంలో పులుల గణాంకాలకు సంబంధించిన నివేదికను మోడీ విడుదల చేశారు. 2006లో దేశంలో మొత్తం పులుల సంఖ్య 1411గా ఉంది. 2014కు అది 2226కు చేరింది. 2018 గణాంకాల ప్రకారం పులుల సంఖ్య ప్రస్తుతం 2,967గా ఉంది. పులులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌ తొలి స్థానంలో ఉంది.

ఈశాన్య రాష్ట్రాలు, చత్తీస్‌గడ్, ఒడిషాలో మాత్రం పులుల సంఖ్య పడిపోయింది. 2014లో మధ్యప్రదేశ్‌ లో పులుల సంఖ్య 308గా ఉంది. ఇప్పుడది 526కు చేరింది. గతంలో పులుల విషయంలో తొలి స్థానంలో ఉన్న కర్నాటక ఇప్పుడు రెండో స్థానానికి పరిమితమైంది. కర్నాటకలో 524పులులు ఉన్నట్టు అంచనా. మూడో స్థానంలో ఉత్తరాఖండ్ ఉంది. ఇక్కడ పులుల సంఖ్య 442గా అంచనా. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర 312, తమిళనాడు 264 ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పులుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. ఉమ్మడి ఏపీలో 2014 నాటికి 68 పెద్ద పులులు ఉన్నాయి. విభజన తర్వాత జరిగిన లెక్కింపు ప్రకారం ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

ఏపీలో నాగార్జునసాగర్‌- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను పులులు నివసించేందుకు ఏకైక అనువైన ప్రదేశంగా గుర్తించారు. 2014 నుంచి నాలుగేళ్లలో పులుల సంఖ్య బాగా పెరిగినట్టు స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా-2018 నివేదిక వెల్లడించింది.

First Published:  30 July 2019 5:22 AM IST
Next Story