Telugu Global
NEWS

సుజానా రాకతో ఏపీ బీజేపీలో సరికొత్త కోల్డ్ వార్

ఏపీ బీజేపీలో సరికొత్త వార్ మొదలైంది. పాత బీజేపీ నేతలు… కొత్తగా వస్తున్న నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇప్పటికే స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ కన్నాతో సుజనా చౌదరికి పడడం లేదు. సుజనా మీటింగ్ లకు కన్నా రావడం లేదు. కన్నా దగ్గరకు సుజనా పోవడం లేదు. కనీసం బీజేపీలో చేరిన తర్వాత ప్రెసిడెంట్ ని సుజనా, సీఎం రమేష్ ఇంతవరకూ మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఏదో ఫార్మాలిటీ […]

సుజానా రాకతో ఏపీ బీజేపీలో సరికొత్త కోల్డ్ వార్
X

ఏపీ బీజేపీలో సరికొత్త వార్ మొదలైంది. పాత బీజేపీ నేతలు… కొత్తగా వస్తున్న నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇప్పటికే స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ కన్నాతో సుజనా చౌదరికి పడడం లేదు. సుజనా మీటింగ్ లకు కన్నా రావడం లేదు. కన్నా దగ్గరకు సుజనా పోవడం లేదు. కనీసం బీజేపీలో చేరిన తర్వాత ప్రెసిడెంట్ ని సుజనా, సీఎం రమేష్ ఇంతవరకూ మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు.

బీజేపీలో చేరిన తర్వాత ఏదో ఫార్మాలిటీ అన్నట్లు సుజనా వ్యవహారం కొనసాగుతోంది. ఢిల్లీ లెవల్లో వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో కేంద్రమంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ కోటాలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ మంత్రి పదవి కోసం ఇప్పటినుంచే లాబీయింగ్ మొదలైంది. బెర్త్ కోసం సుజనా తెగ ట్రై చేస్తున్నారట. మంత్రి పదవి ఇస్తే టీడీపీ నుంచి భారీగా వలసలు ఉండేలా చూస్తానని సుజనా బీజేపీ నేతల ముందు ఆఫర్లు పెట్టారట. ఇప్పటికే ఆయన రాజ్యసభ మెంబర్. కాబట్టి తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తానని చెప్పుకొస్తున్నారట.

మరోవైపు మంత్రి పదవిపై పురంధేశ్వరి కూడా ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాదే ఆమెకు రాజ్యసభ సీటు వస్తుందని ప్రచారం జరిగింది. మోడీ ఆమెకు సీటు ఇవ్వాలని అనుకున్నారట. చివరి నిమిషంలో జరిగిన పరిణామాలతో ఆమెకు ఎంపీ సీటు రాలేదని అంటున్నారు. ఇప్పుడు కేంద్రమంత్రి పదవి ఇచ్చి ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తారని బీజేపీలో ప్రచారం నడుస్తోంది.

అయితే పురంధేశ్వరి సీటుకు సుజనా ఎర్త్ పెడుతున్నారని తెలుస్తోంది. పురంధేశ్వరి కంటే తనకు పదవి ఇస్తే పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని చెప్పుకొస్తున్నారట.

ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వాలని..తనకు అయితే అల్రెడీ ఎంపీని కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారట. మొత్తానికి సుజనా బ్యాచ్ రాకతో బీజేపీలో గ్రూపు రాజకీయాలు వేడెక్కాయి. ఈ గ్రూపుల గోల చివరికి ఎటు దారితీస్తుందో చూడాలి.

First Published:  30 July 2019 5:38 AM IST
Next Story